పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

17


ప్రతిబోయర్‌లోను స్వతస్సిద్ధంగా యోధుని గుణాలు నిండివుంటాయి జనరల్ స్మట్స్, జనరల్ డెవెట్. జనరల్ హర్జోగ్ ముగ్గురూ పెద్దవకీళ్లు ముగ్గురు పెద్దరైతులు ముగురూ అంత పెద్దయోధులే జనరల్ బోధాదగ్గర 9000 ఎకరాల పొలం వుండేది. వ్యవసాయానికి సంబంధించిన పేచీ వ్యవహరాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు సంధివార్తల్లో పాల్గొనుటకు ఆయన యూరప్ వెళ్లాడు. గొర్రెల విషయంలో బోధా అమిత నిపుణుడు అంతటి గొర్రెల నిపుణుడు యూరప్‌లో మరొకడు లేడు అని జనం అనుకునేవారు. ఆ జనరల్ బోధాయే కీ||శే|| ప్రెసిడెంట్ క్రూగర్ గద్దెను అధిష్టించాడు. ఆయన యొక్క ఆంగ్ల జ్ఞానం అమోఘం అయినా ఇంగ్లాండు వెళ్లి జార్జి చక్రవర్తి అక్కడి మంత్రి మండలికి సభ్యుల్ని కలిసినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడలేదు. తన మాతృభాషయగు డచ్‌లోనే మాట్లాడాడు అదీ తమ మాతృ భాషపై గల వారి మక్కువ తమ భావాల్ని ప్రకటించుటకు ఇంగ్లీషు మాట్లాడి తప్పు చేయడం వారికి యిష్టం వుండదు. సరియైన శబ్దం కోసం భావాల్ని కుంచించుకోవడం వారికి యిష్టం వుండదు. బ్రిటిష్ మంత్రి మండలి తెలియని ఇంగ్లీషు ఇడియము (వాక్యాంశం) ను వాడటం. దాని అర్ధం తెలుసుకొనుటకు ప్రయత్నించి మరో సమాధానం చెప్పుడం దానితో గాబరా పడటం. అసలు పనికి ఆటంకం కలగడం వారికి యిష్టం వుండదు అటువంటి పొరపాట్లు వాళ్లు చెయ్యరు

బోయర్ పురుషుల వలెనే స్త్రీలు కూడా నిరాడంబరంగా వుంటారు వారికి శౌర్య ప్రతాపాలు ఎక్కువ బోయర్ యుద్ధంలో పురుషులు వీరోచితంగా పోరాడారు. అందుకు కారణం వారి స్త్రీలే బోయర్ స్త్రీలు వైధవ్యానికి భయపడలేదు. తమ భవిష్యత్తును గురించి కూడా వారు భయపడలేదు

బోయర్లు ధర్మ పరాయణులని పైన వ్రాశాను వారు క్రైస్తవులు అయితే ఏసుక్రీస్తు యొక్క న్యూటెస్టామెంటు యెడ వారికి విశ్వాసమని చెప్పుటకు వీలు లేదు. నిజానికి యూరపు అంతా న్యూటైస్టామెంటసు విశ్వసిస్తున్నదా " విశ్వసిస్తున్నామని అంతా అంటారు కాని ఏసుక్రీస్తు బోధించిన శాంతి