పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

చరిత్ర


ధర్మాన్ని సరిగా పాటించే వారు క్రైస్తవుల్లో తక్కువే బోయర్లకు న్యూటెస్టామెంటు పేరు మాత్రం తెలుసు ఓల్డ్ టెస్టామెంటు మీద వారికి విశ్వాసం ఎక్కువ అందు ముద్రించబడిన యుద్ధాలను వారుశ్రద్ధాభక్తులతో చదువుతారు. ఆ యుద్ధ వర్ణనలను బటిటి వేస్తారు. మూసా ప్రవక్త చెప్పిన కంటికి కన్ను, పంటికి పన్ను ఆను బోధను పూర్తిగా అంగీకరిస్తారు. వాళ్ల వ్యవహార సరళికూడా అలాగే వుంటుంది

తమ మతబోధ ప్రకారం స్వాతంత్ర్య సముపార్జన కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా వుండాలని బోయర్ స్త్రీల నిర్ణయం కనుకనేవారు సంతోషంతో. ధైర్యంతో కష్టాలనన్నింటిని సహించారు. బోయర్ స్త్రీలను లొంగదీయాలని, వాళ్ల ఆవేశం మీదనీళ్లు చల్లాలని లార్డ్‌కిచనర్ ఎంతో ప్రయత్నం చేశాడు. వాళ్లను వేరువేరు క్యాంపుల్లో బంధించి వుంచాడు అక్కడ వాళ్లు అష్టకష్టాలు పడ్డారు. తిండికి నీటికి కూడా శ్రమ పెట్టారు అపరిమిత చలిని, అపరిమితమైన ఎండను భరించారు. చిత్తుగా తాగి మైమరిచిన సైనికులు, కామంతో కళ్ళు మూసుకుపోయిన జవాన్లు ఆ అనాధలపై క్రూరంగా దూకేవారు పలురకాల ఉపద్రవాలు యీ కాంపుల్లో జరుగుతూ వుండేవి. అటునా బోయర్‌స్త్రీల ధైర్యం చెదరలేదు. వాళ్లు ఎవ్వరికీ లొంగలేదు యీ వ్యవహారమంతా తెలుసుకొని ఎడ్వర్డు చక్రవర్తి లార్డ్‌కిచనర్‌కు "నేను దీన్ని సహించలేకపోతున్నాను బోయర్లను వశం చేసుకునేందుకు యిదొక్కటే మార్గం అని అనుకుంటే అది సరికాదు వాళ్లతో ఏవిధమైన రాజీకైనా నేను సిద్ధంగా వున్నాను" అని స్పష్టంగా జాబు వ్రాశారు

ఈ కష్టాలగాధ ఇంగ్లాండు ప్రజలకు తెలిసే సరికి వారంతా ఎంతో బాధపడ్డారు. బోయర్ల ప్రతాపాన్ని తెలుసుకొని ఆంగ్ల ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. జన సంఖ్యలో తక్కువగా వున్నబోయర్ ప్రజలు ప్రపంచమందంతట తమ సామ్రాజ్యాన్ని వ్యాప్తం చేసిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచారే అను బాధ మాత్రం ఆంగ్ల ప్రజలకు కలిగింది. అయితే బోయర్ స్త్రీల కష్టగాధలకు సంబంధించిన సమాచారం ఉదార హృదయులగు