పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

పెండ్లిని పెండ్లిగా గుర్తించకపోవుట


చేయలేదు. ఎలా అరెస్టు కావడమో ఎవ్వరికీ బోధపడలేదు. చాలామంది పురుషులు జైలుకు వెళ్లడానికి సిద్ధపడలేదు సిద్ధపడిన పురుషుల్ని ప్రభుత్వం అరెస్టు చేయలేదు

ఇక చివరి అడుగు వేయాలని నిర్ణయించాం అది అందరినీ ప్రభావితం చేస్తుంది. ఫినిక్సులో వుండే వాళ్లందరినీ, ఇండియన్ ఒపీనియన్ పత్రికకు వినియోగపడే వారిని మినహాయించి, మిగితా వాళ్లందరిని యీ సత్యాగ్రహోద్యమంలోకి దింపి వేయాలని నిర్ణయానికి వచ్చాను. ఇంతకంటే మించి నా దగ్గర మరో ఆయుధమేమీ మిగలలేదు గోఖలే గారికి జాబు వ్రాసేటప్పుడు 16 మంది సత్యాగ్రహలు నా లిష్టులో వున్నారు. అనుమతి పత్రం లేకుండా ట్రాన్స్‌వాల్ ప్రవేశించి ముందు నేను అరెస్టు కావాలి ఈ విషయం ముందుగా ప్రకటిస్తే ప్రభుత్వం అరెస్టు చేయదని భావించాము ఇద్దరు ముగ్గురు స్నేహితులకు తప్ప యి విషయం మరెవ్వరికీ నేను చెప్పలేదు. సరిహద్దు దాటినప్పుడు పేర్లు, చిరునామాలు పోలీసులు అడుగుతూ వుంటారు. అవి తెలుపకూడదని నిర్ణయానికి వచ్చాము. ఆలా చెప్పకపోవడం కూడా నేరమే పేర్లు చిరునామాలు చెప్పి చేస్తే వారంతా నా బంధువులని తెలుసుకొని ప్రభుత్వం వారినెవ్వరినీ అరెస్టు చేయదని భావించాం. మేమంతా ట్రాన్స్‌వాల్‌లో ప్రవేశిస్తాం. అరెస్టు కాకుండా వున్న సోదరీమణులు నేటాలులో ప్రవేశిస్తారు. అనుమతి పత్రాలు లేకుండా ట్రాన్స్‌వాల్, నేటాల్లో ప్రవేశించడం అపరాధమే. అయినా స్త్రీలను అరెస్టు చేయకపోతే వారంతా ముందుకు సాగి న్యూకేసిల్, వెళ్లి గమల్లో పనిచేస్తున్న గిర్‌మిటియా భారతీయ కార్మికుల్ని రెచ్చగొట్టి వారి చేత గనులలో పని మానిపించేలా చేయాలని నిర్ణయించాం. ఈ సోదరీమణుల మాతృభాష తమిళం. కొద్దిగా హిందూస్థానీ వాళ్లకు వచ్చు. అక్కడి గిర్‌మిటియా కార్మికుల్లో అధిక భాగం తమిళులు, తెలుగువాళ్లు. స్త్రీలతోబాటు, కార్మికుల్ని కూడా ప్రభుత్వం అరెస్టు చేయక తప్పదు. స్త్రీలను అరెస్టు చేస్తే భారతీయ కార్మికులల్ని ఆపడం కష్టం. ఈ రకమైన వ్యూహాన్ని రచించి నేను సోదరీమణులకు మంచి శిక్షణ ఇచ్చాను. తరువాత నేను ఫినిక్సు వెళ్లాను. అందరితో నా ప్రణాళికమ గురించి చర్చించాను. మొదట