పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

313


నేను ఫినిక్సులో వుంటున్నా సోదరీమణులతో మాట్లాడాను స్త్రీలను జైళ్లకు పంపే ఆలోచన చాలా ప్రమాదకరమైనదని నాకు తెలుసు. ఫినిక్సులో వుంటున్న స్త్రీలలో ఎక్కువ మంది గుజరాతీవారు. మిగతా సోదరీమణుల వలె ఎక్కువగా శిక్షణ పొందిన వారు కారు. ఇంతే గాక గుజరాతీ మహిళల్లో ఎక్కువ మంది నాకు బంధువులు కూడా నా ముందర మాట్లాడలేక సిగ్గు పడి సరేనని జైళ్లకు వెళ్లి, అక్కడి కష్టాలు సహించలేక క్షమాపణ కోరితే నాకు దెబ్బ తగులుతుంది. అంతేగాక సత్యాగ్రహోద్యమం దెబ్బతింటుంది. నా భార్యను జైలుకు వెళ్లమని ప్రోత్సహించకూడదని నా నిర్ణయం ఆమె నలుగురిలో వెళ్లనని అన్నా లేక వెళతానని అన్నా దానికి ఎంతో విలువ వుంటుందో నాకు తెలుసు ఇలాంటి కఠిన విషయాలలో భార్య స్వయంగా తీసుకునే నిర్ణయానికే విలువ యివ్వాలని నా అభిప్రాయం. భార్య ఏ నిర్ణయమూ చేయలేకపోతే భర్త బాధపదకూడదు. అందువల్ల యీ విషయమై నా భార్యతో ఏమీ మాట్లాడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ట్రాన్స్‌వాల్‌కి చెందిన యితర సోదరీమణుల వలె వారు కూడా నడుం బిగించారు. ఎన్ని కష్టాలు కలిగినా సరే సహించి జైలు శిక్ష అనుభవిస్తామని వారంతా చెప్పారు. మా మాటల సారాన్ని నాభార్య కూడా గ్రహించింది. ఈ విషయం మీరు నాకు చెప్పనందుకు బాధ పడుతున్నాను నేను జైలుకు వెళ్లనని మీరు ఎందుకు అనుకొన్నారు. ఈ సోదరీమణులందరికీ మీరు ఏ మార్గాన నడవమని చెబుతున్నారో నేను కూడా అదే మార్గాన నడవాలని కోరుతున్నాను" అని అన్నది. “నేను నీకు ఎన్నడూ దుఃఖం కలిగించాలని భావించను. ఇందు అవిశ్వాసానికి తావులేదు. నీవు జైలుకు వెళ్లితే నేను సంతోషిస్తాను. అయితే నేను వెళ్లమంటే నీవు జైలుకు వెళ్లావనే భావం ఎవ్వరికీ కలుగకూడదు. ఇలాంటి పనులు తమకు గల ధైర్యంతోనే అందరూ చేయాలి. నేను చెబితే నీవు. సరేనని తప్పక జైలుకు వెళతావు. నాడు తెలుసు. కాని తరువాత కోర్టులో నిలబడినప్పుడు నీరసపడిపోయినా జైలల్లో కలిగే కష్టాలకు బయటపడిపోయినా, అందు నీ దోషం వుందని భావించను. కాని అట్టి స్థితిలో నా పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నేను