పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

311


భారతీయులు అపీలు చేయవచ్చునని తేలింది. అలా చేయకుండా వూరుకుంటే హిందూ, ముస్లిం, పారసీకుల జరిగిన పెండ్లిడ్లు చెల్లవని తేలిపోయింది ఇలాంటి విషయంలో కోర్టు నిర్ణయం భారతీయులకు వ్యతిరేకంగా వుంటే యిక సత్యాగ్రహం తప్ప మరో మార్గం లేదని స్పష్టంగా తేలిపోయింది. యిది అవమానకరమైన పరిస్థితి

ఇక శుభతిధికి, శుభముహూర్తానికి తావే లేకుండాపోయింది. స్త్రీలకు యింత అవమానం జరిగితే ఎవరు ఊరుకుంటారు? దొరికినంత మంది సత్యాగ్రహులతో పై తీర్పుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిపితీరాలని నిర్ణయం చేశాం. యిక స్త్రీలను సత్యాగ్రహంలో చేర్చక తప్పని స్థితి ఏర్పడింది. స్త్రీలను సత్యాగ్రహంలో చేరమని కోరాము సత్యాగ్రహ సంగ్రామంలో చేరితే కలిగే ప్రమాదాల్ని వారికి తెలియచేశాను అరెస్టు అయిన తరువాత, ఆహారాన్ని గురించీ, జైల్లో కలిగే కష్టాలు మొదలుగాగల యిబ్బందులన్నింటిని గురించి స్త్రీలకు తెలియచేశాను. జైల్లో నానాయాతనలకు గురిచేస్తారని, బట్టలు ఉతికే పని అప్పగించ వచ్చునని, అవమానాల పాలు చేయవచ్చునని వగైరా వగైరా విషయాలన్నీ వారికి తెలియచేశాను. అయితే ఒక్క సోదరీ మణికూడ భయపడలేదు. ఒకామె గర్భవతి. మరొకామెకు ఆరు మాసాల బిడ్డ . ఇటువంటి స్త్రీలు సైతం సత్యాగ్రహంలో పాల్గొనుటకు ముందుకు వచ్చారు. వారిని ఆపగల శక్తి నాకు లేదు. వారిలో ఎక్కువ మంది తమిళసోదరీమణులు, వారిలో (1) శ్రీమతి తంబినాయుడు (2) శ్రీమతి ఎస్. పిళ్లె (3) శ్రీమతి కె. మరురగేసన్ పెళ్లె (4) శ్రీమతి ఎస్. పి. నాయుడు (5) శ్రీమతి పి.కె. నాయుడు (6) శ్రీమతి కె చిన్నసామిపిల్లె (7) ఎన్.ఎస్. పిల్లె (8) శ్రీమతి ఆర్.ఏ. ముదలింగం (9) శ్రీమతి భవానీదయాల్ (10) కుమారి ఎం. పెళ్లె (11) కుమారి బి.ఎస్. పిళ్లె మొదలగు వారు వున్నారు. ఏదైనా తప్పుచేస్తే జైల్లో పెడతారు. కానీ ఏ తప్పుచేయకుండా ఎలా అరెస్టు చేస్తారు. అయినా . ప్రభుత్వం స్త్రీలను అరెస్టు చేయలేదు. ట్రాన్స్‌వాల్‌కి చెందిన బెరీవిజింగ్‌లో ప్రవేశపత్రం లేకుండా ప్రవేశించారు. పెద్దగా నినాదాలు చేస్తూ తిరిగారు. ఆరెంజియా సరిహద్దుల్లోకి ప్రవేశించారు. అయినా వారిని ప్రభుత్వం అరెస్టు