పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

293`


స్వాగతసన్నాహాలు చేయసాగారు. ఈ కార్యక్రమాలకు తెల్లవారిని సైతం ఆహ్వానించాం దాదాపు ప్రతి చోటా తెల్లవారు కూడా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ముఖ్యమైన సభలు జరిగినచోట అక్కడి మేయర్ మా ప్రార్థనను మన్నించితే వారినే సభాధ్యక్షునిగా వుంచాలనీ, వీలైతే అక్కడి టౌన్‌హాల్‌ను సభకు వినియోగించుకోవాలని నిర్ణయించాం రైల్వే విభాగం వారి అనుమతి తీసుకుని కొన్ని ముఖ్యమైన రైలు స్టేషన్లను అలంకరించే బాధ్యతను నెత్తిమీద వేసుకున్నాం. చాలా స్టేషన్ల నుంచీ మాకా అనుమతి లభించింది కూడా సాధారణంగా యిలా అనుమతించటం జరుగదు. కానీ స్వాగత సన్నాహాలు యింత పెద్ద ఎత్తున జరగటం చూసిన అధికారులు దీనితో ప్రభావితులై మా యెడ సానుభూతిని ప్రకటించారు. ఉదాహరణకు జోహాన్స్‌బర్గ్ స్టేషన్‌ను అలంకరించటానికి మాకు 15 రోజులు పట్టింది అక్కడ శ్రీ కెలన్ బెక్ ద్వారా రూపొందించబడిన అందమైన చిత్రాల ద్వారాన్ని తయారు చేశాం

దక్షిణాఫ్రికా ఎలాంటి దేశమో గోఖలే గారికి ఇంగ్లాండులోనే అనుభవమైంది. గోఖలే గౌరవ ప్రతిష్టల గురించీ దేశంలో వారి ఉన్నత స్థానం గురించీ భారత మంత్రి దక్షిణాఫ్రికా వారికి ముందుగా తెలియజేసినా ఓడలో వారికి ప్రత్యేక క్యాబిన్ కేటాయించాలన్న విషయం ఎవరికి స్ఫురిస్తుంది?

గోఖలే గారి ఆరోగ్యం చాలా సున్నితమైనది. అందువల్ల వారికి విశ్రాంతి గది అవసరం ఏకాంతం కావలసి వుంది. కానీ కంపెనీ నుంచి ఇలాంటి క్యాబిన్ ఏదీ ఖాళీగా లేదని స్పష్టంగా జవాబు వచ్చింది. ఇండియా ఆఫీసులో గోఖలే గారి మిత్రుడు ఎవరైనా యీ ఏర్పాట్లు చూచారో ఏమో, ఇండియా ఆఫీసునుంచి కంపెనీ డైరెక్టర్‌కు ఉత్తరం వచ్చింది దాని ఫలితంగా క్యాబిన్ లేదు అన్నచోటే వారి కోసం చాలా మంచి క్యాబిన్ తయారైంది. ఈ చేదు అనుభవం పరిణామం మంచిగా మారింది. ఓడ కెప్టన్ కూడా గోఖలే గారిని గౌరవ పురస్పరంగా అద్భుతమైన రీతిలో ఆహ్వానించేందుకు సిఫారస్ చేశారు ఆందువల్ల గోఖలేగారి సముద్ర ప్రయాణం రోజులు ఆనంద దాయకంగాను ఉత్సాహ పూరితంగాను గడిచాయి గోఖలే ఎంత గంభీరులో అంత ఆనంద