పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

గోఖలే యాత్ర - 1


హృదయులు. వినోద ప్రియులు కూడా వారు ఓడలో జరుపబడే క్రీడల్లో పాల్గొన్నారు. తక్కిన ప్రయాణీకులకు ప్రీతి పాత్రులయ్యారు. పొరీని తమ అతిధిగా రమ్మనీ, ప్రభుత్వం పక్షాన రైల్వే యొక్క స్టేట్‌శాల్యూట్ స్వీకరించమని యూనియన్ ప్రభుత్వం కోరింది. నాతో సంప్రదించి ప్రిటోరియాలో ప్రభుత్వ అతిథిసత్కారాన్ని స్వీకరించేందుకు నిశ్చయించుకున్నారు. 1912 అక్టోబర్ 22నాడు గోఖలే కేఫ్‌టౌన్ నౌకాశ్రయంలో దిగారు. వారి ఆరోగ్యం నా ఆశ కంటే కూడా సున్నితంగా వున్నది. ప్రత్యేకమైన ఆహారమే తీసుకునేవారు వారిది అధిక శ్రమను సహించే ఆరోగ్యం కాదు. నేను రూపొందించిన కార్యక్రమం వారి సహనశక్తికి పరీక్షలా పరిణమించింది. వీలైనంత వరకు మార్పులు దానిలో చేశాను. ఆరోగ్యం సంగతి అటుంచి మార్పు చేయవీలుకాని పక్షంలో అలాగే అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొనేందుకు అంగీకరించాను. ఇంతపెద్ద కార్యక్రమం రూపొందించటంలో నా మూర్ఖత్వాన్ని నేనే తిట్టుకున్నానని వారితో అన్నాను నేను రూపొందించిన కార్యక్రమాల్లో మార్పు చేసేందుకు వీలుకానివి కూడా కొన్ని వున్నాయి. గోఖలే గారికి సంపూర్తిగా ఏకాంతం అవసరమని నేను వూహించలేదు. అందువల్ల యిబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. "రోగపీడితులు గురుజనులు వంటి వారి సేవ శుశ్రూషల అభ్యాసం ఆసక్తి వుండటం వల్ల వారి కార్యక్రమాలలో అవసరమైన మార్పులు చేసి ఏకాంతాన్ని వారికి నమకూర్చగలిగాను. పూర్తి యాత్రలో ఒక కార్యదర్శిగా వారికి నేను సహకరించాను. అర్థరాత్రి సమయంలో కూడా మా స్వయం సేవకులు సిద్ధంగా వుండేవారు. ఇలాంటి సేవకుల వల్ల గోఖలే గారికి అసౌకర్యం కలిగిందని ఎవరైనా అంటే నేను అంగీకరించను.

కేఫ్‌టౌన్‌లో మంచి సభ జరగాలని నిర్ణయం. శ్రాయినర్ కుటుంబం గురించి మొదటి ఖండంలో నేను వ్రాశాను. ఆ కుటంబంలోని పెద్ద మనిషి శ్రీ డబ్ల్యు.పి. శ్రాయినర్ గారిని సభాధ్యక్షునిగా వుండమంటే - ఆయన అంగీకరించారు. చాలా పెద్ద సభ జరిగింది. అనేక మంది భారతీయులు ఆంగ్లేయులు కూడా వచ్చారు. గోఖలే గారికి మధుర వచనాల్లో స్వాగతం పలికి దక్షిణాఫ్రికా యందలి భారతీయులపట్ల తన సానుభూతిని శ్రాయినర్