పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

గోఖలే యాత్ర - 1


పరిణామమే జరిగింది. ఎవరైనా కల్పనలోనైనా ఊహింపలేని పరిస్థితులు ఈశ్వరుడే కల్పించాడో లేదా అవంతటనే వచ్చాయో తెలీకుండా ఎదురయ్యాయి. ఎవరూ అనుకోని విధంగా సహాయమూ లభించింది. సత్యాగ్రహులకు వూహాతీతమైన పరీక్ష ఎదురైంది. బైటి ప్రపంచానికి అర్థమయ్యే విధంగా బాహ్యవిజయమూ వారికి లభించింది,

గోఖలే తదితర భారతీయ వాయకులకు దక్షిణాఫ్రికా వచ్చి అక్కడ భారతీయుల స్థితిని గమనించమని నేను కోరేవాడిని కానీ ఎవరైనా వస్తారా రారా అన్నదే నా సందేహం ఎవరైనా భారతీయ నాయకుణ్ణి దక్షిణాఫ్రికా పంపే ప్రయత్నం శ్రీ రిచ్ చేస్తున్నారు. కానీ సత్యాగ్రహ సమరం పూర్తిగా మందగించినపుడు అక్కడికి వచ్చే ధైర్యం ఎవరికుంటుంది? 1911 లో గోఖలే ఇంగ్లాండులో వున్నారు. దక్షిణాఫ్రికాలో హిందూ దేశీయుల యీ సమరాన్ని ఆయన అధ్యయనం చేశారు కూడా. భారతదేశపు పార్లమెంటులో (25 ఫిబ్రవరి 1910) గిర్‌మిట్ కార్మికులను నేటాల్ పంపడం ఆపేయాలనీ సూచించారు. గోఖలే గారితో నా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే వున్నాయి. భారతదేశ మంత్రితో యీ విషయమై వారుచర్చలు కూడా జరిపి దక్షిణాఫ్రికా వెళ్ళి యీ సమస్యను సంపూర్ణంగా అధ్యయనం చేసి రాగలనని తెలియజేశారు కూడా వారు గోఖలే గారి ప్రస్తావనను ఒప్పుకున్నారు. ఆరువారాల దక్షిణాఫ్రికా పర్యటనను రూపొందించమని, గోఖలే నాకు వ్రాస్తూ తన తిరుగు ప్రయాణం తేదీ కూడా తెలియజేశారు. మా ఆనందానికి అవధులే లేవు అప్పటిదాకా ఏ భారత పాయకుడూ దక్షిణాఫ్రికా యాత్ర చేయలేదు. దక్షిణాఫ్రికామాట అటుంచి హిందూ దేశం బైట ఉన్న ఏ ప్రాంతంలోని భారతీయులను కలవటం కానీ, వారి స్థితి గతులను కనుక్కొనే ప్రయత్నంగాని అసలెవ్వరూ చేయలేదు. అందువల్ల గోఖలే వంటి గొప్ప నేతను కలవటం గొప్ప మహత్తరమైన అవకాశంగా భావించాం ఒక చక్రవర్తికి కూడా జరగని గౌరవాన్ని గోఖలే గారికివ్వాలని మేము నిశ్చయించుకున్నాం. దక్షిణాఫ్రికాలోని అన్ని ముఖ్యమైన నగరాలకు వారిని తీసుకెళ్ళాలని మేము నిర్ణయించాం. సత్యాగ్రహులు ఇతర భారతీయులూ ఆనందంగా గోఖలే గారికి