పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

291`


36

గోఖలే యాత్ర - 1

ఇలా టాల్‌స్టాయ్ ఆశ్రమంలో సత్యాగ్రహులు తమ జీవితాలను గడిపేవారు తమ అదృష్టంలో ఏముంటే దాన్ని అనుభవించటానికి సిద్ధమయ్యేవారు ఈ సమరం ఎప్పుడు కొలిక్కి వస్తుందో వారికి తెలియదు దాన్ని గురించిన ఆలోచనా వారికి లేదు. వారి ప్రతిజ్ఞ ఒక్కటే ఈ హత్యా సదృశమైన చట్టం ముందు తల వంచకూడదు. ఇలా చేసేటప్పుడు యే దుఃఖం సహించవలసి వచ్చినా దాన్ని సంతోషంగా సహించడమే సత్యాగ్రహ యోధునికి యుద్ధంలో విజయం తప్పదు. అందులోనే అతనికి సుఖం వుంది. అతడు దాన్నే సుఖమని తలుస్తాడు. యుద్ధం అతనే చేస్తున్నప్పుడు గెలుపు - ఓటమి సుఖదు:ఖాలు అతని చేతిలో వున్నట్లే కదా! దుఃఖమూ పరాజయమన్న మాటలు అతని శబ్దకోశంలో లేవని చెప్పవచ్చు గీత మాటల్లో చెప్పాలంటే సుఖదు:ఖాలు గెలుపు ఓటమి అతనికి సమానం

సత్యాగ్రహులు జైలుకు వెళ్తూ వస్తూ వుండేవారు. ఆశ్రమంలో జరిగే కార్యకలాపాలను చూస్తూ అక్కడ సత్యాగ్రహులుంటారనీ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నారనీ ఎవరికీ సందేహం వచ్చేదికాదు. నాస్తికుడు లేదా సందేహాలపుట్ట ఎవరైనా వచ్చాడంటే ఆ వచ్చిన వాడు మిత్రుడైతే మాపై జాలి చూపించేవాడు. విశ్లేషకుడైతే మమ్మల్ని నిందించేవాడు మీరు సోమరులై పోయారు. అందుకే యీ అడవిలో పడి రొట్టెలు తింటున్నారు. నగర జంజాటంన్నుండి దూరంగా పండ్లతోటల్లో నియమబద్ధ జీవనాన్ని గడువుతూన్నరంటే జైల్లో వుండి అలసి పోయారన్నమాట అని అనివుండేవాడు. అనుచిత రీతిలో నైతిక నియమాలను ఉల్లంఘించిన సత్యాగ్రహులు జైళ్ళకు వెళ్ళి పుండలేరని వీరికి ఎలా నచ్చజెప్పటం? పత్యాగ్రహులకు శాంతిలోనూ సంయమంలోనే సమరానికి సన్నద్ధమయ్యే సుగుణమున్నదని వారికి చెప్పటం ఎలా? సత్యాగ్రహులైన వారు ఎవరి సహాయంకోసమో వేచి చూడరనీ వారికి దైవ సహాయమే గొప్ప ఆశ్రయమనీ ఎలా తెలియజేయడం? ఇలాంటి