పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

289


పోయాను. దక్షిణాఫ్రికాలో వున్నప్పుడు పని చేసిన ఉపచారాలు భారతదేశంలో సఫలమవలేదు. దీనికి కారణం నాలో ఆత్మవిశ్వాసం తక్కువవటం లేదా యిక్కడి వాతావరణంలో ఆ చికిత్సా విధానం అంత పని చేయక పోవటం కారణం కావచ్చు. కానీ ఒకటి ఇలాంటి వైద్యం వల్ల, టాల్‌స్టాయ్ క్షేత్రంలో అలవడిన నిరాడంబరత వల్ల ఎక్కువ కాకపోయినా కనీసం రెండు మూడు లక్షల రూపాయలు మిగిలి వుంటాయి. అక్కడున్న వారిలో కుటుంబ జీవన భావం పెంపొందింది. సత్యాగ్రహులకు నిజమైన ఆశ్రయం దొరికింది. అవినీతి, గర్వం వీటికి అవకాశం లేకుండా పోయింది. మంచీ చెడూ విడి పోయాయి. ఇవి ప్రత్యక్షంగా వారు తెలిపినవిషయం.

పైన ఆహారపు ప్రయోగాలను గురించి చెప్పిన విషయాలన్నీ ఆరోగ్య దృష్టితో చేసినవే నేను నా పైనే ఒక్క అద్భుత ప్రయోగం చేసుకున్నాను. ఆధ్యాత్మిక దృష్టితో జరిగిన ప్రయోగమిది.

శాకాహారులుగా మనము పాలు తీసుకునే అధికారం వుందా లేదా అన్న ప్రశ్న గురించి నేను చాలా అలోచించాను. దీన్ని గురించి బాగా చదవివాను కూడా కానీ ఆశ్రమంలో వుండేటప్పుడు నేనో పుస్తకమో పేపరో చూచాను. కలకత్తాలో ఆవులు బర్రెలతో చాలా క్రూరంగా వ్యవహరించి ఒక్కో పాల బొట్టు వాటి స్తనాల నుంచి పిండుతున్నారని చదివాను వెదురు గొట్టాల్లో తీవ్ర ఔషధాలను నింపి, వాటి స్థనాలకు తగిలించి అందులోని పాలన్నింటినీ పిండివేసే భయంకర పద్ధతిని గురించిన వర్ణన కూడా చదివాను. కేలన్ బెక్‌తో పాలు తీసుకోవలసిన ఆవశ్యకత గురించి చర్చిస్తూ యీ ప్రక్రియ గురించి కూడా ప్రస్తావించాను పాలు తాగటాన్ని ఆపివేస్తే దానివల్ల ఒనగూడే ఆధ్యాత్మిక ప్రయోగాల గురించి చెబుతూ పాలు తాగటం మానేస్తే మంచిదని అన్నాను కెలన్ బెక్ చాలా సాహసి తక్షణం యీ ప్రయోగానికి వారు సిద్ధపడ్డారు. వారికి నా మాటలు బాగా నచ్చాయి. అందువల్ల కేవలం తాజాపళ్ళు ఎండుద్రాక్ష ఖర్జూరం లాంటి వాటిపైనే కొద్ది రోజులు గడపాలని నిర్ణయించాం. వండిన పదార్థాలను తీసుకోవటం ఆపి వేశాం. ఈ ప్రయోగం వల్ల కలిగిన ఫలితం గురించి చర్చించటానికి యిది సరైన చోటు కాదు. కానీ కేవలం ఫలాహారం పైననే అయిదు సంవత్సరాలు గడిపిన నాకు