పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


ఏనాడూ బలహీనత గానీ మరే విధమైన అనారోగ్యం కాని కలుగలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఆ రోజుల్లో పని చేసేందుకు సంపూర్ణ శక్తి నాకు సదా లభించింది. ఆ రోజుల్లో రోజుకు 35 మైళ్ళ దూరం నడవగలిగేవాణ్ణి. 40 మైళ్ళ వరకూ యాత్ర చేయటం నాకు మామూలు విషయం. ఈ ప్రయోగంవల్ల నాలో జరిగిన ఆధ్యాత్మిక పరిణామాలు అద్భుతమని ఖచ్చితంగా చెప్పగలను. రాజకీయ కార్యక్రమాలనుంచి తీరిక కాస్త దొరికితే యీ వయసులో సైతం శరీరంతో యిబ్బందులు ఎదురైనా సరే ఆధ్యాత్మిక పరిణామాల పరీక్ష నిమిత్తం రెండవ సారి ఆ ప్రయత్నం చేయగలను డాక్టర్లలోను, వైద్యులలోను ఆధ్యాత్మిక దృష్టి లోపించటం కూడా నా ప్రయోగంలో బాధాకరం అయింది.

ఇప్పుడిక యీ మధురమైన ప్రతిభావంతమైన జ్ఞాపకాలకు తెరవేయాలి ఇలాంటి కఠిన ప్రయోగాలు ఆధ్యాత్మిక పరిశుద్ధతను గురించిన విషయాల్లోనే జరుగగలవు. అంతిమ సత్యాగ్రహ సమరానికై టాల్‌స్టాయ్ క్షేత్రం. ఆధ్యాత్మిక శుద్ధిని తపశ్చర్యలను పెంపొందించే కేంద్రంగా నిరూపితమైంది. ఇలాంటి స్థానమే దొరికి వుండకపోతే ఎనిమిది సంవత్సరాలపాటు సత్యాగ్రహం నడిచివుండేదో కాదో, అధికధనం సమకూరి వుండేదో కాదో? చివరికి వేలాది భారతీయులు జాతి పోరాటంలో పాల్గొన గలిగే వారో కాదో నని నా అనుమానం. టాల్‌స్టాయ్ ఆశ్రమం గురించి గొప్పలు చెప్పుకోవాలన్న విషయమేమీ పెట్టుకోలేదు. కానీ, అప్పట్లో అక్కడి ప్రజల సామభూతి పుష్కలంగా పొందింది. తాము ఏ పమలు చేయటానికి సిద్ధంగా లేరో. ఏ పనులు తమః దుఃఖం కలిగించేవిగా కఠినమైనవిగాను తోస్తాయో ఆ పసులను ఆశ్రమవాసులు చేయగలరని ప్రజలు తెలుసుకున్నారు. 1913లో మళ్ళీ పెద్ద ఎత్తున సమరం చెలరేగినప్పుడు దానికి ప్రజల యీ విశ్వాసం అంతులేని పెట్టుబడిగా తోడ్పడింది. ఇలాంటి పెట్టుబడి వల్ల లాభం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. నాకైతే యీ విషయంలో ఏ పందేహమూ లేదు. పాఠకులకూ వుండకూడదు.