పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


యిచ్చారు. తన దగ్గర ఒకటి వుంచుకున్నారు. దాన్ని దగ్గరుంచుకుని రాత్రిపూట పడుకునేవాణ్ణి. ఒక రోజు మెలుకువగా వుండాలని నిశ్చయించుకున్నాను. వాకిలి బయట వరండాలో నా పడక లోపల వాకిలికి దగ్గరగానే లుటావనీ పడుకునేవారు. అర్థరాత్రి అతనికి దగ్గు వచ్చింది. అతను అగ్గి పెట్టె వెలిగించి బీడీ తాగటం మొదలెట్టాడు. నేను వెమ్మదిగా పడక మీద నుంచి లేచి అతని దగ్గరికి వెళ్ళి టార్చిలైటు వెలిగించాను లుటావస్ గాబరాపడ్డాడు. పరిస్థితి అర్థమైంది. బీడి అర్చి, నా కాళ్ళు పట్టుకున్నాడు నేను చాలా తప్పు చేశాను. ఇక పొగాకు జోలికి వెళ్ళను. మిమ్మల్ని వేను మోసగించాను నన్ను క్షమించండి" అంటున్నప్పుడు లుటావన్ గొంతు పూడుకుంది. నేను అతణ్ని సముదాయించాను. "బీడీ తాగకపోతే నీకు మంచిది నా అంచనా ప్రకారం నీకు దగ్గు తగ్గితీరాలి కానీ తగ్గకపోతే నీవు దొంగతనంగా బీడీ తాగుతున్నావేమోననిపించింది. అన్నాను లుటావన్ బీడీ అలవాటు మానిపోయింది. దానితో పాటు అతని ఉబ్బసమూ దగ్గూ కూడా తగ్గాయి. ఒక నెలలో ఆరోగ్యవంతుడై లుటావన్ మంచి తేజస్సుతో బలం సమకూర్చుకుని మా దగ్గర సెలవు తీసుకున్నారు.

రెండు సంవత్సరాల స్టేషన్ మాస్టర్ కొడుకుకు టైఫాయిడ్ వచ్చినప్పుడు నా ప్రకృతి వైద్యం గురించి తెలిసి వుండటం వల్ల నా దగ్గరికొచ్చారు. మొదటి రోజు ఆహారమేమీ యివ్వలేదు. రెండవ రోజు బాగా పండిన అరటిపండు ఒక చెంచా నూనె, తియ్యని నారింజ పండ్ల రసపు చుక్కలు యిచ్చాను. రెండవ పూట భోజనం పెట్టలేదు రాత్రి ఆ అబ్బాయి కడుపు పైన మట్టి లేపనాన్ని రాశాము జబ్బు నయమైంది. ఆ బాలునికి డాక్టరు యిచ్చిన మందులు సరైనవి కాకపోవటమో లేదా వారి నిర్ధారణ సరియైనది కొక పోవడమో జరిగిందన్న మాట. టాల్‌స్టాయ్ అశ్రమంలో యిలా నేను చేసిన ఎన్నో ప్రయోగాలలో కొన్నైనా విఫలమయ్యాయన్న ఫిర్యాదు వచ్చినట్టు నాకు గుర్తులేదు. అదే ఉపచారాలు యీ రోజు ఎవరికైనా చేయటానికి నేను ముందు వెనుకాడతాను. టైఫాయిడ్ జ్వరానికి అరటిపండు నూనె యివ్వాలంటే యిప్పుడు నేను వణికి పోతాను. 1918లో భారత దేశంలో వున్నప్పుడు అజీర్తివల్ల బంక విరోచనాలు పట్టుకున్నాయి. దీనికి నేను వైద్యం చేసుకోలేక