పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


ఇలాంటి వారు టాల్‌స్టాయ్ ఆశ్రమంలో నివసించటం తిండి, విద్రా, యింకా ఆశ్రమ వాసులతో పూర్తిగా కలిసిపోవటం - యిది సాధారణ విషయం కాదు. కొంతమంది తెల్లవారు అతనిని మూర్ఖుడనీ పిచ్చివాడని పిలిచేవారు. మరికొంతమందికి వారి త్యాగ నిరతిని చూచి గౌరవం పెరిగింది. తన త్యాగాన్ని దుఃఖం రూపంలో భావించుకొని వారు క్రుంగిపోయిన సందర్భాలేవీ లేవు. తన వైభవం వల్ల పొందిన ఆనందం కంటే త్యాగం వల్లె ఎక్కువ ఆనందాన్ని పొందారు శ్రీ బెక్. నిరాడంబరత్వంలోని సుఖాన్ని వర్ణిస్తూ వారందులో లీనమై పోయే విధానాన్ని గమనిస్తే వినేవారికి సైతం ఆ ఆనందాన్ని అనుభవించాలనిపించేది. చిన్నా పెద్దా అందరితో ఎంతో బాగా కలిసి పోయారు. వారు లేని ఒక్క క్షణం కూడా మాకు బాధాకరంగా వుండేది. కెలన్ బెక్‌కు పండ్ల చెట్లంటే చాలా ప్రీతి అందుకే వాటి భారాన్ని సైతం తనపైనే వేసుకున్నారు. రోజూ ఉదయం బాలబాలికలతో పెద్దలతో తోటపని చేయించేవారు. వారుకూడా చాలా శ్రమించేవారు. ఎప్పుడూ నవ్వుతూ వుండటం వారి లక్షణం. అందుకే వారితోబాటు పనిచేయటం ఆశ్రమవాసులకు యిష్టంగా వుండేది. రాత్రి 2 గంటలకు లేచి జోహాన్స్‌బర్గ్ వెళ్ళటానికి తయారయ్యే బృందంలో బైక్ తప్పక వుండేవారు.

వారితో మత సంబంధమైన చర్చలు నేనెప్పుడూ చేసేవాణ్ణి. అహింస నత్యము మొదలైన నియమాలు. వ్రతాలు తప్ప మాట్లాడేందుకు నా వద్ద విషయాలేమీ లేవు. పాములు మొదలైన వాటిని చంపటం పాపమని నేనన్నప్పుడు తక్కిన నా ఆంగ్లేయ మిత్రులలాగా బెక్ సైతం కంగు తిన్నారు. కానీ చివరికి తాత్విక దృష్టితో ఆలోచించి నాతో ఏకీభవించారు. మనబుద్ధి అంగీకరించిన విషయాన్ని ఆచరణలోకి తీసుకు రావటం మంచిదే. ధర్మంకూడా యీ విషయం మా పరిచయ ప్రారంభ దినాలలోనే వారంగీకరించారు. అందువల్లే ఎలాంటి సంకోచము లేకుండా ఒక్క క్షణంలో ఒక మహత్తరమైన పరివర్తనకు వారు శ్రీకారం చుట్టారు. పాములవంటి వాటిని చంపటం పాపమైతే వాటితో స్నేహం చేయటం. పెంచుకోవటం అవసరమని వారు అభిప్రాయపడి విభిన్న జాతుల సర్పాలను గుర్తించటానికి అవసరమయ్యే