పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

281


తీసుకోలేదు. మమ్మల్ని విశ్రాంతి తీసుకోనివ్వలేదు. వారి ఉపన్యాసాలన్నీ మేము పుస్తకంగా అచ్చువేయబోతున్నాము. ఆ పుస్తకమంతా సరిజూశారు ఎప్పుడైనా ఏదైనా వ్రాయాలనుకుంటే అటూ యిటూ తిరుగుతూ ఆలోచించుకునే అలవాటు వారికుండేది. వారు ఒక చిన్న ఉత్తరం వ్రాయవలసి వచ్చింది. ఆ ఉత్తరం వెంటనే వ్రాసేస్తారాయన అనుకున్నాను. కానీ అలా జరుగలేదు. నేనా ప్రస్తావన తీసుకు వచ్చినపుడుక వారి ప్రసంగం వినాల్సి వచ్చింది . నా జీవన పద్ధతి గురించి నీకేం తెలుసు? చిన్న పని కూడా అంత తొందరగా చేయను తెలుసా? దాని పైన బాగా ఆలోచిస్తాను. దాని కేంద్ర బిందువేమిటో నిర్ధారణ చేస్తాను. ఆ విషయానికి సంబంధించిన భాష గురించి ఆలోచిస్తాను ఆ తరువాతే రాస్తాను. అందరూ యిలాగే చేస్తే ఎంత సమయం ఆదా అవుతుంది? మరి యీ రోజుల్లో ప్రజల్లోనూ ఎన్నో నీచ నికృష్ట భావాలు చోటు చేసుకున్నాయి. వాటి ఆక్రమణ నుంచి తప్పించుకోవచ్చుగదా? - యిదీ వారి మాటల సారాంశం. గోఖలేను కలవటం గురించి వ్రాయకపోతే టాల్‌స్టాయ్ ఆశ్రమం గురించిన అనుభవాలు ఎలా అసంపూర్ణంగా వుండిపోతాయో అలాగే కెలన్ బెక్ యొక్క జీవన పద్దతుల గురించి వ్రాయకపోతే యీ జ్ఞాపకాలు అర్థాంతరాలుగా మిగిలిపోతాయి. ఈ పరిపూర్ణుడైన శుద్ధ మనస్కుణ్ణి ముందే పాఠకులకు పరిచయం చేశాను. టాల్‌స్టాయ్ క్షేత్రంలో మాతో కెలన్ బెక్ ఎంత బాగా కలిసిపోయారో అది ఒక ఆశ్చర్యకరమైన విషయం సాధారణ విషయాలు గోఖలేని ఏమాత్రం ఆకర్షించేవికావు కానీ కెలన్‌బెక్ జీవితంలో వచ్చిన పరివర్తనను గమనించి వారు కూడా ఆకర్షితులయ్యారు. వారికి ఎండ చలి ఎప్పుడూ అలవాటే లేదు. జీవితంలో ఎప్పుడూ వారికి ఎలాంటి అసౌకర్యము కలుగ లేదు. నిజం చెప్పాలంటే స్వచ్ఛంద జీవనాన్ని వారు తమ జీవనాదర్శంగా తీసుకున్నారు. ప్రపంచపు వైభవ విలాసాలను అనుభవించటంలో ఏ ఒక్కటి వారి జీవితంలో అసంపూర్తిగా లేదు. తన సొంత ఆనందం కోసం వారు డబ్బు సంపాదించటానికి ఏనాడూ వెనుకడుగు వేయలేదు.