పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

రెండవ ప్రతినిధి సంఘం


నియమాలూ కఠినమైనవి. ఇలాంటి సందర్భాలలోనూ ఖైదీలు కలుసుకునే వీలు లేదు సత్యాగ్రహులో ఓసారి జైల్లోకి వెళితే యిక అక్కడి విషయాలన్నీ జైల్లోనే చూచుకోవాలి. నిజానికి ఈ సత్యాగ్రహం బీదరికానికి వ్యతిరేకంగా బీదలే చేసిన సమరం అందువల్ల యిలాంటి ప్రతిజ్ఞలతో పాటు పెద్ద ఆపదలు వెంటపడేవి అయినా ఖైదీలు స్థిరంగా వున్నారు. వారి ఆనాటి సాహసం అత్యంత ప్రశంసనీయమైనది. ప్రజలు యిలాంటి ఉపవాసాలాకు అలవాటు పడివుండలేదు. కానీ సత్యాగ్రహులు తమ ప్రతిజ్ఞపై నిలిచినందువల్లే వారికి విజయం లభించింది. ఏడు రోజుల ఉపవాసం తరువాత వారిని వేరే జైలుకు తరలించమని అధికారులు ఆజ్ఞను జారీ చేశారు.




32

రెండవ ప్రతినిధి సంఘం

ఇలా ప్రభుత్వం భారతీయ సత్యాగ్రహులను జైల్లో పెట్టించడం వారికి దేశ బహిష్కరణశిక్ష విధించటం వంటి పనులు చేస్తూనే వున్నది. ఇందులో హెచ్చుతగ్గులు మాత్రం వుండేవి. రెండు పక్షాలూ ఓ విధంగా చప్పబడి పోయాయి తమ ప్రతిజ్ఞపై దృఢంగా వుండే భారతీయులను జైళ్లకి పంపితే దానివల్ల వారు ఏమాత్రం దైర్యం కోల్పోకపోవటం వారికి దేశ బహిష్కరణ శిక్షను విధిస్తే దానివల్ల తామే విమర్శల పాలవటం ప్రభుత్వం వారు గమనించారు. కోర్టుకెళ్ళే కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే ఓడిపోవలసి వచ్చింది. భారతీయులు సైతం ఉద్రేకంతో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరు అంతపెద్ద సంఖ్యలో సత్యాగ్రహం చేసేవారు కూడా యిప్పుడు లేరు కొంతమంది పిరికి వారయ్యారు మరికొంతమంది అలిసిపోయారు కొందరు పూర్తిగా ఓడిపోయి యింకా సత్యాగ్రహంలో పాల్గొంటున్నవారిని మూర్ఖులుగా పరిగణించసాగారు. మరి యీ మూర్ఖులు తమను బుద్ధిమంతులుగా భావించి భగవంతునిపైన పోరాటపు నిజాయితీపైన, తాము నమ్ముకున్న