పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

257


సాధనాల సత్యనిష్ఠపైన సంపూర్ణ విశ్వాసాన్ని నిలిపారు. చివరికి పత్యమే గెలుస్తుందని వారి నమ్మకం.

ఈలోగా దక్షిణాఫ్రికా రాజకీయాలేమీ ఆగలేదు. నిరంతర చలనం దానిది.. దక్షిణాఫ్రికాలోని అన్ని అధినివేశరాజ్యాలను ఏకత్రితం చేసి బోయర్ మరియు ఆంగ్ల ప్రజలు అధిక స్వాతంత్ర్యాన్ని పొందాలనుకోసాగారు. జనరల్ హార్డ్‌జోగ్, బ్రిటన్‌తో సంబంధం తెంపుకోవాలని కోరుకోసాగారు ఇతరులు బ్రిటన్‌లో నామమాత్రపు సంబంధాన్ని కొనసాగించాలని ఆనుకోసాగారు. బ్రిటీష్ సామ్రాజ్యంతో సంబంధ బాంధవ్యాలను పూర్తిగా త్రుంచేయటం తెల్లవారికి యిష్టంలేదు. బోయర్లు మరియు తెల్లవారికి అవసరమయ్యేవన్నీ బ్రిటిష్ పార్లమెంటు ద్వారానే పొందాలి అందువల్ల దక్షిణాఫ్రికా విషయం బ్రిటిష్ మంత్రివర్గం ముందుంచేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపాలని ఇరుపక్షాలవారూ నిశ్చయించారు

అన్ని ప్రాంతాలు కలిపి ఒకే సంఘంగా మారితే ఇప్పుడున్న స్థితి మరీ ఆధ్వాన్నమవుతుందని దక్షిణాఫ్రికా భారతీయులు గమనించారు. అన్ని ప్రాంతాలవారూ భారతీయులనేదో రీతిగా అణచివేయాలని కోరుతుండేవారు అందువల్ల భారతీయులకు వ్యతిరేకమైన ప్రాంతాలన్నీ ఏకమైతే భారతీయ ప్రజలను మరింతగా నొక్కి వుంచాలని చూస్తారు. అప్పుడిక భారత్ గోడు వినే నాధుడుండడు. అయినా ఒక్క ప్రయత్నాన్నీ వదలకూడదన్న ఉద్దేశ్యంతో మళ్ళీ తమ వైపు నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని ఇంగ్లాండు పంపాలని భారత ప్రజ నిర్ణయించింది. ఈ సారి ప్రతినిధి బృందంలో నాతో పాటు పోరుబందర్‌కి చెందిన హాజీ హబీబ్ సేఠ్ గారిని నియమించటం జరిగింది చాలా రోజులనుంచి ట్రాన్స్‌వాల్‌లో వారి వ్యాపారమొకటి నడుస్తున్నది వారికి చాలా పెద్ద అనుభవంవున్నది. ఆంగ్లేయ భాషలో సుశిక్షితులు కాకపోయినా డచ్, ఆంగ్లం జూలూ మొదలైన భాషలన్నీ చాలా సునాయాసంగా అర్ధం చేసుకునే వారాయన సత్యాగ్రహుల పట్ల వారికి మంచి సానుభూతి వున్నా వారు మాత్రం సంపూర్ణ సత్యాగ్రహులు కారు. 1909 జూన్ 23న ఏ నౌకలో (కీనిట్ వర్తికైసల్) మేము కేప్ టౌన్ నుంచి ప్రయాణమయ్యామో అందులోనే