పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

255


పరిగణించటం సాధారణంగా జరుగుతూ వుంటుంది. కానీ సత్యం. దీనికి విరుద్ధంగా వుంటుంది 50 రూపాయలు యివ్వగలిగిన వారు 25 రూపాయలే యిచ్చి వూరుకోవటం, ఐదు రూపాయలు యివ్వగలిగేవారు. 5 రూపాయలు యిచ్చివేయటంలోని తేడా గమనిస్తే రెండవ వ్యక్తి ఎక్కువ త్యాగం చేశాడని అనుకోవాలి కానీ 25 రూపాయలు యిచ్చిన వ్యక్తి 5రూపాయలు యిచ్చిన వ్యక్తిని గర్వంగా చూస్తాడు. కానీ గర్వపడవలసిన అవసరమతనికి లేదని మనకు తెలుసు అలాగే తన బలహీనత వల్ల ముందుకు వెళ్ళలేనివారు. తమశక్తినంతా ఖర్చుచేశారని అనుకుందాం మనస్సులో సత్య నిష్ఠ లేకుండానే ఇది వరకటి వ్యక్తి కంటే ఎక్కువ శక్తిని ఖర్చుపెట్ట గలిగినా, సహజంగా మొదటి వ్యకియే యెక్కువ యోగ్యుడని భావిస్తాం సమరం ముందుకు సాగటానికి అట్టివారు నిలచి ఉన్నారు

ఇలా భారతీయుల పరీక్ష, దినదినానికీ తీవ్రరూపం దాలుస్తూవుంది. వారెంత ధైర్య స్థైర్యాలను చూపిస్తే, ప్రభుత్వం అంత కన్నా ఎక్కువ హింసాత్మక ధోరణిని పెంచుతూ వున్నది. ఉత్పాతం సృష్టించే ఖైదీలకోసం, లేదా ప్రభుత్వం లొంగదీయదలచే ఖైదీలకోసం ప్రతిదేశంలో కొన్ని ప్రత్యేక కారాగారలు వుంటాయి. ట్రాన్స్‌వాల్‌లోనూ యిలాంటి పద్ధతి వుంది ఆలాంటి ఓ జైలు పేరు ధాయ్‌క్లుఫ్ అక్కడి జైలరూ చాలా కఠినుడే ఖైదీలతో చేయించే పనికూడా కఠినమైనదే కానీ అక్కడున్న భారతీయ ఖైదీలు తమకు అప్పగించిన కఠినమైన పసులను సైతం సవ్యంగా పూర్తి చేసి చూపించారు. కఠినంగా శ్రమించేందుకు వారు సిద్ధంగా వుండేవారు కానీ జైలరు చూసే అవమానాన్ని భరించలేకపోయేవారు. అందుకై వారు ఉపవాసాన్ని ప్రారంభించారు. 'మీరి జైలరును మార్పించటమో లేదా మమ్మల్నే యిక్కడినుంచి మార్చటమో చేయనంతవరకు మేము ఆహారాన్ని తీసుకోము అన్నదే వారి షరతు. ఉపవాసమున్న ఖైదీలు దొంగతనంగా అవీయివీ తినడమంటూ చేయలేదు. చాలా నిష్ఠగా ఉపవాసం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో అయితే ప్రజల ఆందోళనలు జరిగేవి కానీ ట్రాన్స్‌వాల్‌లో యిలాంటి అవకాశం లేదు. అంతేకాక అక్కడి