పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

223


26

యుద్ధం తిరిగి ప్రారంభం

ఓవైపు జనరల్ న్మట్స్‌కు ఒప్పందపు నియమాలను పాటించమని నచ్చజెపుతూనే మరోవైపు జాతిని జాగృతం చేసే పని కూడా ఉత్సాహంగా మేము చేస్తూ వున్నాము. ప్రతి చోటా ప్రజలు మళ్ళీ యుద్ధ సన్నాహాలు చేయటానికి, సిద్ధంగా వున్నట్లు మాకు తోచింది. అన్ని చోట్లా సభలు జరిగాయి. ప్రభుత్వంతో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలను గురించి ప్రజలకు ప్రతిచోటా చెబుతూనే వున్నాము ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ప్రతివారమూ ముద్రించబడే సమీక్ష వల్ల పరిస్థితులు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు అవగతమవుతూనే వున్నాయి. స్వచ్ఛందంగా అంగీకరించే ఆజ్ఞలను మన్నించమనీ, లేకపోతే ప్రమాదం వున్నదని మేము వారికి నచ్చజెబుతూ ఆ విధంగా వారిని మేల్కొలుపుతూ వున్నాము ఈ దగుల్బాజీ చట్టాన్ని రద్దు చేయలేకపోతే, యీ ఆజ్ఞల నన్నింటినీ కాల్చి బూడిద చేయాల్సి వుంటుందని ప్రజలకు చెప్పేశాం. దీనివల్ల ప్రజలు తమ మాటపై దృఢంగా స్థిరంగా పున్నారనీ, జైళ్ళ పాలయేందుకు సైతం వెనుకాడబోరనీ ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఆజ్ఞాపత్రాలను తగులబెట్టేందుకై ప్రతిచోట వాటిని పెద్ద ఎత్తున సేకరించటం జరిగింది

గత ప్రకరణంలో ప్రస్తావించిన బిల్లును ప్రవేశపెట్టేందుకై ప్రభుత్వం సిద్ధపడింది. ట్రాన్స్‌వాల్ పార్లమెంటుకు కూడా భారత ప్రజలు అర్జీలు పంపారు. కాని దానివల్ల ఫలితం కలుగలేదు. చివరికి సత్యాగ్రహులందరూ ప్రభుత్వానికి "అల్టిమేటం" పంపించారు. యుద్ధానికి సిద్దం కమ్మని ప్రభుత్వానికి పంపబడిన బెదిరింపు లేఖ అని దానికి అర్థం తీశారు. భారత పౌరుల పక్షాన యీ అల్టిమేటం అన్న పదాన్ని వుపయోగించటం జరుగలేదు. కానీ దేశప్రజల నిర్ణయాన్ని తెలియజేసేందుకై పంపబడిన యీ పత్రాన్ని అల్టిమేటంగా చిత్రించి జనరల్ స్మట్స్ పార్లమెంటులో ప్రసంగించాడు. ఇలా ప్రభుత్వాన్ని