పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?


ఇతను వాగ్దానం చేశాడు. నాకు బాగా గుర్తు వున్నది నా శక్తి వంచన లేకుండా నేను చేయగలిగినంత వరకూ భారతీయులకు సహాయం చేస్తాను' అని అతడు చెప్పాడు

అయితే అతడు ఏమైనా చేయాలనుకుంటే ఎవ్వరు ఆపలేరు. పత్రికల వ్రాతలని అతనే మాత్రమూ లెక్క పెట్టడు. అందువల్ల నా సహాయం వల్ల మీకేమీ లాభం వుండదేమోనని నా భయం" అని కూడా ఆయన అన్నాడు శ్రీ హస్కిన్ మొదలైన వారిని కూడా నేను కలిశాను జనరల్ స్మట్స్‌కు వారూ లేఖలు వ్రాశారు. వారికీ నిరాశాజనకమైన జవాబులు అందాయి విశ్వాసఘాతుకం అనే శీర్షికతో ఇండియన్ ఒపీనియన్‌లో నేను ఉత్తరాలు కూడా వ్రాశాను కానీ జనరల్ స్మట్స్ వాటిని లెక్కబెడితే కదా! తాత్వికుణ్ణి లేదా కౄరకర్కశ హృదయుణ్ణి మీరెంత విమర్శించినా లాభం ఏముంటుంది? తాననుకున్న పని చేయుటయందే అతడు నిమగ్నమై వుంటాడు. ఈ రెండు ఏశేషణాల్లో దేన్ని జనరల్ స్మట్స్‌కు ఉపయోగించాలో నాకు తెలియదు అతని చేతుల్లో ఓ రకమైన దార్శనికత వున్నదన్న విషయం నేను అంగీకరించక తప్పదు. మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేటప్పుడు నా లేఖలు పత్రికలలో ముద్రింపబడేటప్పుడు నేను అతణ్ణి నిర్దయునిగా భావించటం నాకిప్పటికీ గుర్తు వున్నది. కానీ అప్పుడు సత్యాగ్రహయుద్ధం ప్రధమ దశలో వున్నది. ఏడు సంవత్సరాల పాటు నడిచిన ఆ యుద్ధానికి అప్పటికి రెండేళ్ల ప్రాయమే. ఈలోగా జనరల్ స్మట్స్‌ని నేను చాలా సార్లు కలిశాను తరువాతి మా సంభాషణలవల్ల జనరల్ స్మట్స్ వ్యక్తిత్వం గురించి దక్షిణాఫ్రికా ప్రజల అభిప్రాయం మారి వుండాలని నా కనిపించింది. రెండు విషయాలు నాకు స్పష్టంగా తెలియ వచ్చాయి. ఒకటి, రాజకీయాల్లో అతను కొన్ని సిద్ధాంతాలను నమ్మినవాడు. రెండు అన్ని సందర్భాల్లోనూ అతడి ఆలోచనలు అవినీతిమయమైనవని అనుకోవటానికి వీలు లేదు. కానీ ఆయన రాజకీయ నైపుణ్యం కనబరచేందుకు దానితో పాటు అభాసుపాలు కావటానికి కూడా అవకాశం యిస్తాడని తెలుసుకున్నాను.