పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

221


కాఛలియా సేర్ జీవితంలో జరిగిన పై సంఘటనలన్నీ యీ ప్రకరణంలో ఉటంకించిన కమిటీ సమావేశం జరిగిన తరువాతనే జరిగినవి కావని పాఠకులీపాటికి గ్రహించే వుండవచ్చు. వాటన్నింటిని ఒకసారే వర్ణించటం మంచిదని తలచి యీ ప్రకరణంలో నేను వాటిని వ్రాశాను. తేదీల ప్రకారం చూస్తే 1908, 10 సెప్టెంబరు నాటికి సత్యాగ్రహం తాలూకు రెండవ సంగ్రామం మొదలైంది. దాని తరువాత కొన్ని రోజులకు కాఛలియా అధ్యక్షుడయ్యారు. దాని తరువాత రాదాపు ఐదు నెలలకు ఆయన దివాళా తీసినట్టుగా ప్రకటించటం జరిగింది

ఇప్పుడు మనం కమిటీ సమావేశం తరువాతి పరిణామాల మీద దృష్టి సారిద్దాం. దీని తరువాత నేను కొత్త బిల్లు ప్రభుత్వానికీ దేశ ప్రజలకు మధ్య ఒప్పందానికి భంగం కలిగిస్తున్నదని జనరల్ స్మట్కు లేఖ వ్రాశాను. ఈ ఒప్పందం తరువాత వారం రోజులలోపే రిచ్మండ్‌లో వారు చేసిన ఉపన్యాసం మీద వారి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాను తమ ప్రసంగంలో వారు వీళ్లు (ఆసియా వాసులు) ఆసియా చట్టాన్ని రద్దు చేయమని నాతో చెబుతున్నారు. కానీ యీ ప్రజలు స్వచ్ఛందంగా మా ఆజ్ఞలను పాటించనంతవరకూ నేనీ చట్టాన్ని రద్దు చేయను" అని చెప్పారు. తమను ఇబ్బందుల్లో పడేసే విషయాలకు రాజకీయ నాయకులు సాధారణంగా జవాబివ్వరు. ఒకవేళ యిచ్చినా అది తేలికగా వుంటుంది. జనరల్ స్కట్స్ యీ కళలో పూర్తిగా ఆరితేరాడు మనం ఎంత వ్రాసినా ఎంత మాట్లాడినా జవాబు యివ్వాలని వారికి లేనప్పుడు వారిచేత జవాబు చెప్పించటం ఎవరి తరమూ కాదు కదా వచ్చిన ప్రతి ఉత్తరానికి జవాబు యిచ్చి తీరాలన్న నియమం వారికే మాత్రమూ లేదు. అందువల్ల నేను రాసిన లేఖలకు వారి నుండి తృప్తి కలిగించే జవాబు ఒక్కటి కూడా రాలేదు

ఒప్పందం సమయంలో ప్రభుత్వానికి మాకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రీ ఆల్బర్ట్ కార్టరాయిట్‌ను నేను కలిశాను. జనరల్ స్కట్స్ వెలువరించిన కొత్త బిల్లు వల్ల వారికీ పెద్ద దెబ్బే తగిలింది. యీ మనిషిని నేను అర్థం చేసుకోలేకుండా వున్నాను ఆసియా చట్టాన్ని రద్దు చేస్తానని