పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

యుద్ధం తిరిగి ప్రారంభం


బెదిరించే వారికి దాని శక్తి తెలియదన్నమాట స్మట్స్ నాకు బాధకలిగే మాట ఒకటి అన్నాడు. కొంతమంది ఆందోళనకారులు, భీద భారతీయులను రెచ్చగొడుతున్నారు. యిట్టి ప్రభావానికి లోనయ్యే వారు తామే నాశనమై పోతారు పాపం పార్లమెంటులోని పలువురు సభ్యులు యీ అల్టిమేటం అన్న మాటవిని కోపోద్రిక్తులయ్యారని పత్రికా విలేఖరులీ సందర్బంగా వ్రాశారు వారి నేత్రాలు అరుణారుణమయ్యాయనీ, పత్రికలు ప్రకటించాయి

"హిందూదేశ ప్రజలు స్వచ్ఛందంగా ఆజ్ఞాపత్రాలను స్వీకరిస్తే వాటిని చట్టపరమైనవిగా అంగీకరించేందుకై ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామనీ, ఏషియాటిక్ చట్టాన్ని రద్దు చేస్తామనీ, హిందూదేశ ప్రజలకు జనరల్ స్మట్స్‌కూ జరిగిన ఒప్పందంలో స్పష్టంగా వ్రాసుకున్నారు ప్రభుత్వోద్యోగులను సంతోషపెట్టేందుకై, యీ విధంగా హిందూ దేశ ప్రజలు ఆజ్ఞా పత్రాలను తయారు చేసుకున్నారు. అందువల్ల యిప్పుడిక ఆసియా చట్టాన్ని రద్దుచేయటం తప్పనిసరి అయింది. ఈ విషయమై ఎన్నో లేఖలు జనరల్ స్మట్స్‌కు ప్రజలు వ్రాశారు. న్యాయం పొందేందుకై అవసరమైన యితర చట్టపరమైన ఉపాయాల్ని కూడా అనుసరించారు. కానీ, జాతి ప్రయత్నాలేవీ నెరవేరలేదు. పార్లమెంటులో బిల్లు అనుమతి పొందే స్థితిలో వున్నపుడు హిందూ దేశ ప్రజలలో నెలకొన్న ఉత్కంఠత, ఉద్వేగం ప్రభుత్వానికి తెలియబరచటం, నాయకుల విద్యుక్త ధర్మంకదా! ఒకవేళ ఒప్పందం ప్రకారం ఆసియా చట్టాన్ని రద్దు చేయకపోతే, లేదా రద్దు చేసిన వార్త జాతి ప్రజలకు ఫలానా సమయం వరకు తెలియ చేయకపోతే స్వచ్చందంగా ప్రజలు స్వీకరించిన అనుమతి పత్రాలను తగులబెట్టటం జరగుతుందని, అలా చేయటం వల్ల ఎదురయ్యే కష్టాలను వినయంతో, స్థిర చిత్తంతో ఎదుర్కొని సహించగలరని వేదనా భరిత హృదయాలలో చెప్పుకొనటం కూడా జరిగింది

ఈ విధంగా జవాబివ్వమని గడువు విధించటాన్ని అల్టిమేటంగా చిత్రాంచారు. రెండోరి తెల్లదొరలు హిందూదేశ ప్రజలను ఆటవిక ప్రజలుగా