పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

జనరల్ స్మట్స్ చేసిన నమ్మక ద్రోహం?


మరింత స్పష్టం చేసేవిగా వున్నా వీటి ప్రభావం ఆంగ్లేయవ్యాపారులపై పడలేదు నిద్రపోతున్న మనుషుల్ని మనం లేపగలంకాని నిద్రపోతున్నట్టు నటించేవారిని లేపలేము కదా ఆంగ్లేయ వ్యాపారస్థుల ధోరణియిదే కాఛలియాపై ఒత్తిడి తేవటం ఎలాగైనా లొంగేలా చేయటమే వారి లక్ష్యం అయితే తమ డబ్బుకేమీ డోకా లేదని వారికీ తెలుసు

1909 జనవరి 22న నా కార్యాలయంలో ఆంగ్లేయ అధికారుల సభ ఒకటి జరిగింది కాఛలియా పై వారు తెచ్చే ఒత్తిడి కేవలం రాజకీయాలకి సంబంధించినదే కాని వ్యాపారానికి సంబంధించింది కాదని వారికి నేను స్పష్టంగా చెప్పాను వ్యాపారస్థులకు రాజకీయ ఎత్తుగడలు శోభించవు. కానీ వాళ్లు కోపోద్రిక్తులయ్యారు. కాఛలియా సేర్ దగ్గరి ప్యాపారసంబంధమైన వస్తువుల లిస్టులు వున్నాయి. వాటిని వారికి చూపించి, వారి డబ్బు పైసలతో సహా వారికి తిరిగి వస్తుందని నిరూపించాను. కాఛలియా వ్యాపారాన్ని ఇతరులకు అమ్మాలనుకుంటే అతడు తన వద్దవున్న వ్యాపార సంబంధమైన అన్ని వస్తువులనూ, వచ్చిన లాభమంతటినీ కొనేవారికి యిచ్చేందుకు సిద్ధంగా వున్నారు. ఒకవేళ తెల్లదొరలీ విధంగా చేయని పక్షంలో కాఛలియా దుకాణంలో వున్న వస్తువులను అసలు ధరకే కొనాల్సి వుంటుంది. ఇలా చేసినప్పటికీ డబ్బు తక్కువైతే, దానికి బదులుగా లాభం వచ్చిన మొత్తంలో వారికి యిష్టం వచ్చినంత తీసుకోవచ్చు నా యీ సలహాను పాటించినట్లయితే తెల్లదొరలు నష్టపోయేదేమీ వుండదని పాఠకులీపాటికి గ్రహించి వుంటారు (నా క్లైంట్ల విషయంలో ఆర్థిక సంక్షోభం సమయంలో నేనీ ఏర్పాటు చాలాసార్లు చేశాను.) కానీ యిప్పుడు తెల్లవ్యాపారులకి కావలసింది న్యాయం కాదు. కాఛలియాను ఎలాగైనా లొంగదీయాలన్నదే వారి ఆశయం కానీ కాఛలియా లొంగలేదు. అందుకనే కాఛలియాను దివాళా తీసిన వ్యాపారస్థునిగా ప్రకటించారు

ఈ స్థితివల్ల కాఛలియా ప్రతిష్టకు భంగం కలుగలేదు. పైగా ఇది వారికి మరో అలంకారమై పోయింది. ఈ కారణంగా దేశ ప్రజల్లో వారి గౌరవం మరింత పెరిగింది. వారి ధృడవిశ్వాసం వీరత్వం ప్రజలందరి అభినందనలకు