పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

219


పాత్రమయ్యాయి. ఈ రకమైన వీరత్వం ఆలౌకికమనే చెప్పాలి. సామాన్య మానవుడికీ ఔన్నత్యం అవగతం కాదు. దివాళా తీయటం వల్ల అప్రతిష్ట పాలవటం అటుంచి గౌరవం యినుమడించటమన్నది సామాన్య మానవునికి అర్థంకాని విషయం కానీ కాఛలియాకిది చాలా స్వాభావికమైన అనుభవం చాలా మంది భారతీయ వ్యాపారులు దివాళా భయంతో దగుల్బాజీ చట్టం ముందు లొంగిపోయారు. తలుచుకుంటే కాఛలియా దివాళా తీయకుండా తప్పించుకొనేవారే సత్యాగ్రహ యుద్ధం నుంచి తప్పుకొని యీ స్థితినుంచి వారు తప్పించుకోవచ్చు. కానీ అందుకు వారు సిద్ధపడలేదు. ఎంతో మంది భారతీయ స్నేహితులు యీ సంకటస్థితిలో వారికి అప్పుగా డబ్బు యివ్వడానికి సిద్ధపడ్డారు కాని యీ విధంగా తన ప్యాపారాన్ని కాపాడుకొని వుంటే వారి సాహసాలకు మచ్చ ఏర్పడి వుండేది జైలుకు వెళ్ళటమనే ఆపదకు అందరు సత్యాగ్రహులు సిద్ధమే ఏ సత్యాగ్రహుని వద్ద డబ్బుతీసుకొని తెల్ల వ్యాపారస్తులకు చెల్లించి వుండినా వారికది కళంకమే అయ్యేది. కానీ సత్యాగ్రహం చేసే వ్యాపారులతో వారికి స్నేహం వున్నట్లే చట్టానికి తలవంచే వ్యాపారులతోనూ వారికి స్నేహం వుంది. వారి సాయం కాఛలియాకు లభిస్తుందని నాకు తెలుసు ఒకరిద్దర్ని యీ విషయమై ఆయన పిలువనంపిన విషయం నేనెరుగుదును కానీ వారి సాయాన్ని పొందటం కంటే ఖూనీ చట్టానికి లొంగటమే మేలు అందువల్ల వాళ్ల సహాయాన్ని ఎప్పుడూ తీసుకొనకూడదని మేము నిర్ణయించుకున్నాం ఇంతే కాక రాఛలియా తాను దివాళా తీసినట్టుగా ప్రకటించటం వల్ల యితరులకది రక్షణ కవచంగా మారవచ్చు. ఎందుకంటే ఇలాంటి 99 శాతం సందర్భాల్లో దివాళా దారునికి డబ్బులిచ్చిన వారు కొంతకు కొంతైనా నష్టపోవలసి వుంటుంది. ఇచ్చిన డబ్బులో 50 శాతం దొరికితే చాలు నంతోషపడిపోతారు 75 శాతం దొరికితే పూర్తి డబ్బు అందినట్లే అనుకుంటారు. కారణం - దక్షిణాఫ్రికాలోని పెద్ద పెద్ద వ్యాపారస్థులు ఇలాంటి లావాదేవీల్లో 6 1/4 వంతు కాక 25 శాతం లాభం పొందుతుంటారు. అందువల్ల 75 శాతం మొత్తం పొందగలిగితే దాన్ని వారు