పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

217


తెల్లదొరలు కాఛలియాను తమ ఉచ్చులో బంధించారు. దక్షిణాఫ్రికాలోని చాలా మంది భారతీయ వ్యాపారులు ఆంగ్లేయ వ్యాపారులపై ఎక్కువగా ఆధారపడి వున్నారు. ఎలాంటి అమానతు పైకం తీసుకోకుండానే లక్షలాది రూపాయల వస్తువులు భారతీయ వ్యాపారులకు అప్పుడు వాళ్లు యిస్తుంటారు అంటే అంతటి విశ్వాసాన్ని భారతీయ వ్యాపారులు ఆంగ్లేయ వ్యాపారులవద్ద పొందగలిగారన్నమాట. ఇది భారతీయ వ్యాపారుల విశ్వాస పాత్రతకు ఒక మంచి ఉదాహరణ! కాఛలియా పై కూడా ఎంతోమంది ఆంగ్లేయ వ్యాపారుల ఋణభారం వుంది. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం పక్షాన ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బెదిరించే ఉద్దేశ్యంతో ఆంగ్లేయ వ్యాపారులు కాఛలియాను త్వరగా తమ అప్పు తీర్చమని పట్టుపట్టారు. వాళ్ళు కాఛలియాసు పిలిపించి సత్యాగ్రహం నుంచి మీరు తొలగిపోతే మేము అప్పు తీర్చమని వేధించం కానీ యీ యుద్ధం నుంచి తప్పుకోకపోతే ప్రభుత్వం మిమ్మల్ని అరెస్టు చేస్తుందేమోనని మా భయం అప్పుడిక మా డబ్బు సంగతేమౌతుంది?. అందువల్ల యీ సత్యాగ్రహ యుద్ధం నుంచి మీరు తప్పుకోలేని పక్షంలో మా డబ్బు మాకు తక్షణం చెల్లించండి" అని చెప్పాడు ధీరుడైన కాఛలియా ఏ మాత్రం చలించలేదు - భారతీయుల సత్యాగ్రహంలో పాల్గొనటం నా వ్యక్తిగత విషయం దానికీ నా వ్యాపారానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఆ యుద్ధంతో నా ధర్మం నా దేశ గౌరవం నా స్వాభిమానం అన్నీ ముడిపడి వున్నాయి. నాకు మీరంతా అప్పిచ్చారు. అందుకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాని యీ విషయంలో నా వ్యాపారం గొప్పదని భావించడం లేదు. బంగారు నాణేల్లా మీ డబ్బు నా దగ్గర భద్రంగా వుంది నా ఆఖరి నిముషంలోనైనా, నేను అమ్ముడుపోయైనా మీ డబ్బు మీకు యిస్తాను కాని ఒకవేళ నాకేమైనా జరిగితే, నా వద్ద ఉన్న స్టాకు నా యితర లావాదేవీలన్నీ మీ చేతుల్లోనే వున్నాయి కదా అందువల్ల ఇదివరకటి విశ్వాసం నాపై అలాగే కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను" అని అన్నాడు కాఛలియా ఈ మాటలన్నీ సముచితంగానే వున్నా, కాఛలియా విశ్వాసపాత్రతను