పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

175

జనరల్ స్మట్సు నవ్వుతూ "మీరు యిప్పటి నుంచే ముక్తులు మీ అసుచరుల్చి రేపు విడుదల చేయమని ఫోను చేసి చెబుతాను ఒక్క సలహా మీరు సభలు ప్రదర్శనలు చేయకండి ఆలా చేస్తే ప్రభుత్వం యిబ్బందుల్లో పడుతుంది" అని అన్నాడు

"కేవలం ఉత్సవం కోసం ఒక్క సభకూడా జరుగనీయను మీరు నమ్మండి అయితే ప్రభుత్వంతో ఒడంబడిక ఎలా జరిగిందో, దాని స్వరూపం ఏమిటో, ఒడంబడిక జరగడంవల్ల భారతీయుల బాధ్యత ఎంత పెరిగిందో జాతి ప్రజలకు సభలు చేసి నేను చెప్పాలి గదా" అని సమాధానం యిచ్చాను అటువంటి సభలు ఎన్నైనా చేసుకోండి నా అభిప్రాయాన్ని మీరు గ్రహించారు చాలు" అని స్మట్సు అన్నాడు

అప్పుడు సాయంత్రం 7 గంటలైంది నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు జనరల్ స్మట్సు గారి సెక్రటరీ జోహన్స్‌బర్గ్ వెళ్లుటకు అవసరమైన రైలు చార్జీ నాకు యిచ్చాడు. ప్రిటోరియా యందలి భారతీయులను కలిసి వారికి ఒడంబడిక విషయం చెప్పవలసిన అవసరం అంతగాలేదు నాయకులంతా జోహాన్స్ బర్గ్‌లో వున్నారు. మా కేంద్ర కార్యాలయం కూడా అక్కడే వున్నది జోహన్స్ బర్గ్ వెళ్లే రైలు ఆరోజున యిక ఒక్కటే వున్నది. నేను దాన్ని అందుకున్నాను.



22

ఒడంబడికకు వ్యతిరేకత

రాత్రి సుమారు 9 గంటలకు నేను జోహన్స్ బర్గ్ చేరాను తిన్నగా అధ్యక్షులు సేర్ ఈసప్‌మియాఁ గారింటికి వెళ్లాను. నన్ను ప్రిటోరియా తీసుకు వెళ్లిన విషయం వారికి అప్పటికే తెలిసింది. అందువల్ల వారు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఒంటరిగా నన్ను చూచి వారు ఆశ్చర్య పడ్డారు సంతోషించారు కూడా. సాధ్యమైనంత మందిని పిలిచి యిప్పుడే సభ జరపడం