పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఒడంబడికకు వ్యతిరేకత


మంచిదని చెప్పాను ఈసప్‌మియాఁ, మరియు యితర మిత్రులకు నా సలహానచ్చింది. ఎక్కువమంది ఒకే పేటలో వుంటున్నారు. అందువల్ల అందరికీ సమాచారం పంపడం తేలికయే అధ్యక్షుని యిల్లు మసీదుకు దగ్గరలో వున్నది మా సభలు సామాన్యంగా మసీదునందలి మైదానంలోనే జరుగుతూ వుంటాయి. అందువల్ల సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనవసరం లేదు వేదిక మీద ఒక దీపం వుంచితే చాలు రాత్రి 11 లేక 12 గంటలకు సభజరిగింది. అయినా సుమారు వెయ్యిమంది వచ్చి సభలో పాల్గొన్నారు

సభకు ముందుగా అక్కడ వున్న పెద్దలకు ఒడంబడికకు సంబంధించిన వివరాలు చెప్పాను కొంతమంది నాయకులు ఒడంబడికను వ్యతిరేకించారు అయితే పూర్తి వివరాలు చెప్పిన మీదట వారు అంగీకరించారు. అయితే అందరినీ ఒక సందేహం పట్టుకున్నది. "జనరల్ స్మట్ను మోసం చేస్తే ఏమి చేయడం? రక్తపు చట్టం అమలులోకి రాక పోయినా, ఘననెత్తి మీద కత్తిలా వ్రేలాడుతూ వున్నదిగదా! యీ లోపున స్వేచ్చగా అనుమతి పత్రాలు మనం తీసుకుంటే మన చేతులు మనం నరుక్కున్నట్లే అవుతుంది. ఆ చట్టాన్ని వ్యతిరేకించే మహత్తరమైన ఒక్కగానొక్క ఆయుధం మన చేయి జారిపోతుంది యిది చూస్తూ చూస్తూ శతృవు పరిచిన వలలో చిక్కుకోవడమే అవుతుంది. ముందు రక్తపు చట్టం రద్దు కావాలి తరువాత మనం పత్రాలు తీసుకోవాలి అని తమ అభిప్రాయం తెలియజేశారు. వాళ్లు చెప్పిన మాట నాకు సరియైనదేనని అనిపించింది. ఆ విధంగా చెప్పిన వారి తెలివి తేటలయెడ ఎంతో గౌరవం నాకు కలిగింది. సత్యాగ్రహులు యిలా వుండాలని నాకు అనిపించింది

నాయకులు చెప్పిన మాటలకు సమాధానం యిలా యిచ్చాను. "మీరు చెప్పింది నిజం దాన్ని గురించి గంభీరంగా యోచించ వలసిందే. రక్తపు చట్టం రద్దయిన తరువాతనే మనం పత్రాలు తీసుకోవాలి. యింతకంటే మంచి మాట మరొకటి లేదు. అయితే యిది ఒడంబడిక లక్షణం కాదని నా అభిప్రాయం సిద్ధాంత రీత్యా ఒప్పందం కుదిరినప్పుడు మిగతా విషయాల