పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

మొదటి ఒడంబడిక


ఆ యజమానులకు సంబంధించిన స్వార్థ వ్యవహారంలో దప్పమిగతా వ్యవహారాలన్నింటి విషయంలో ఆయా పత్రికా సంపాదకులు స్వతంత్రంగా సంపాదకీయాలు వ్రాస్తూ వుండేవారు యీ పత్రికా సంపాదకులు విద్వాంసులు ప్రఖ్యాతి చెందిన ప్రముఖులనుంచి ఎన్నుకోబడుతూ వుండేవారు ఉదాహరణకు ది డైలీస్టార్ అను దినపత్రికా సంపాదకుడు ఒకప్పుడు లార్డ్ మిల్నరుకు అంతరంగిక సెక్రటరీగా పని చేస్తూ వుండేవాడు. తరువాత ఆయన టైమ్సు అనుపత్రికా సంపాదకుడుగా పని చేసిన శ్రీ బకల్‌కు బదులు, ఆ పత్రికా సంపాదకుడుగా పనిచేయుటకు ఇంగ్లాండు వెళ్లాడు. శ్రీ ఆల్బర్ట్ కాల్టరైట్ యోగ్యుండేగాక ఉదార హృదయుడు కూడా ఆయన వ్యాసాలు వ్రాసి భారతీయుల్ని సమర్థించాడు. ఆయనకు, నాకు గాఢమైన స్నేహం ఏర్పడింది నేను జైలుకు వెళ్లిన తరువాత ఆయన జనరల్ స్మట్సును కలిశారు ఒడంబడిక నిమిత్తం వారి మధ్యవర్తిత్వాన్ని జసరల్ స్మట్స్ అంగీకరించాడు

భారతీయ నాయకుల్ని కూడా ఆయన కలుసుకోగా చట్టానికి సంబందించిన సూక్ష్మాలు మాకు తెలియవు. గాంధీ జైల్లో వుండగా, మేము ఒడంబడికను గురించి మాట్లాడటం జరుగదు. ప్రభుత్వంతో ఒడంబడిక చేసుకోవడం మాకు యిష్టమే కాని మా వాళ్లను జైల్లో బంధించి ప్రభుత్వం ఒడంబడిక చేసుకోవాలని అనుకుంటే జైలుకు వెళ్లి గాంధీని కలువ వలసిందే" అని వాళ్లు స్పష్టంగా చెప్పారు

ఈ విధంగా శ్రీ కార్టరైట్ నన్ను కలుసుకొనేందుకు వచ్చారు. వారు ఒడంబడికకు సంబంధించిన ముసాయిదా తెచ్చారు. జనరల్ స్మట్స్ దాన్ని తయారు చేశారని లేక వారు ఆమోదించారని చెప్పవచ్చు. ఆముసాయిదా నాకు నచ్చలేదు. దానియందలి భాష అస్పష్టంగా వున్నది. అయితే ఒక్క మార్పు చేస్తే నేను స్వయంగా దాని మీద సంతకం చేయడానికి సిద్ధపడ్డాను అయితే బైటి భారతీయుల అనుమతి లభించినా, జైల్లో వున్న నా అనుచరుల అభిప్రాయం తెలుసుకోకుండా నేను ఒడంబడిక ముసాయిదా మీద సంతకం చేయలేను అని వారికి చెప్పి వేశాను