పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

171


చేసుకోండి అని ఆయన చెప్పాడు. అయితే మా చేత కవాతు చేయించండి అని అన్నాము పెద్ద శిక్షపడ్డ హబ్షీలు కవాతు చేస్తూ వుండటం మేము చూచాము మీ కోరికను అంగీకరిస్తే నాకు మంచిదే మీఖైదీల సంఖ్య పెరిగినందున వార్డరుకు పనిభారం పెరిగింది నేను అతడికి ఆర్డరు వేయను అతడు కవాతు చేయిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. అని సూపరింటెండెంటు అన్నాడు వార్డరు మంచివాడు సూపరింటెండెంటు అనుమతి అతడికి కావాలి ప్రతిరోజూ ఉదయం శ్రద్దగా మా చేత కవాతు చేయించసాగాడు మా గదుల ముందు గల కొద్ది ప్రాంగణంలోనే మేము కవాతు చేయాలి. అందువల్ల మేము గుండ్రంగా తిరుగుతూ వుండాల్సి వచ్చింది. మా ఫరాన్ అనుచరుడు నవాబ్ ఖాన్ వార్డరు. వెళ్లాక మాచేత కవాతు చేయిస్తూ వుండేవాడు. కవాతుకు సంబంధించిన ఇంగ్లీషు శబ్దాల్ని ఉర్దూ ఉచ్చారణతో పలికి మమ్మల్ని బాగా నవ్విస్తూ వుండేవాడు. "స్టాండ్ ఎట్ ఈజ్'ను 'టండలీస్' అని అనేవాడు టండలీస్ అంటే ఏమిటో ముందు మాకు అర్థం కాలేదు. అయితే ఆ తరువాత యిది హిందూస్తానీ శబ్దం కాదని. నవాబ్ ఖాస్ ఇంగ్లీషు అని తెలుసుకొని నవ్వుకున్నాం



21

మొదటి ఒడంబడిక

ఈ విధంగా మేము జైల్లో సుమారు 15 రోజుల పాటు వున్నాము యింతలో బైటినుంచి వచ్చిన క్రొత్తవాళ్లు ప్రభుత్వంతో ఏదో ఒడంబడిక జరుపుకొనుటకు ప్రయత్నం సాగుతున్నదని సమాచారం తెచ్చారు. రెండు మూడు రోజుల తరువాత జోహన్స్‌బర్గ్ నుంచి వెలువడే ట్రాన్సవాల్ లీడర్ అసు దిన పత్రికా సంపాదకుడు శ్రీ ఆలబర్ట్ కార్టరైట్ నన్ను కలుసుకోవాలని, జైలుకు వచ్చాడు. ఆ రోజుల్లో జోహన్స్ బర్గ్ నుంచి వెలువడే దినపత్రికలన్నిటి యాజమాన్యం బంగారం గనుల ఏదో ఒక యజమాని చేతిలో వుండేది