పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

నిర్బంధాల వెల్లువ


ఔన్సుల డబల్ రొట్టె ఆహారంగా యిచ్చేవారు. సాయంత్రం మొక్కజొన్నల పిండతో తయారైన సంకటి. లేక గంజి, కొద్దిగా కూర, ముఖ్యంగా బంగాళా దుంపలు యిచ్చే వారు పెద్దవైతే ఒక బంగాళా దుంప చిన్నవైతే రెండు దుంపలు యిచ్చేవారు. యీ భోజనంతో ఎవ్వరికడుపు నిండేదికాదు బియ్యం వండితే మెత్తబడేది జైలు డాక్టర్ని పిలిచి మసాలా దినుసులు యిమ్మని కోరాం భారతదేశంలో యిస్తారని చెప్పాం “ఇది భారత దేశం కాదు. ఖైదీలకు నోటి రుచితో సంబంధం లేదు. అందువల్ల మసాలా దినుసులు యివ్వడానికి వీలులేదు" అని గట్టిగా అరిచాడు. డాక్టరును వ్యతిరేకించాము యిది రుచికి సంబంధించిన వ్యవహారం కాదు. శరీరానికి కావలసిన అవసరమైన తత్వాలకు సంబంధించిన విషయం యీ భోజనం వల్లఅట్టి తత్వాలు లభించవు కదా డాక్టరు యీ విధంగా ఆలోచించలేదు నిరాకరించడమే అతడిపని జైలు సూపరింటెంటు మాకోరికను అంగీకరించి మీ భోజనం మీరే తయారు చేసుకోమని చెప్పాడు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. అయితే వస్తువులు అందజేసే జైలు అధికారులకు, మనవాళ్లకు వస్తువుల ఎక్కువ తక్కువలను గురించి ఘర్షణ జరుగుతూ వుందేది. వారానికి రెండు రోజులు కూరలు తయారు చేస్తారు. అప్పుడు రెండుసార్లు వంటచేసేవాళ్లు మిగతా రోజుల్లో ఒక సారే వంట చేసేవాళ్లు మధ్యాహ్న భోజనమప్పుడే మరో పదార్థం చేసుకోడానికి అంగీకరించేవాళ్లు వంట పని మన వాళ్ల చేతుల్లోకి వచ్చాక అంతా సంతోషంగా భోజనం చేయసాగారు

ఇటువంటి సౌకర్యాలు లభించినా, లభించకపోయినా శిక్షను అనుభవించవలసిందే సత్యాగ్రహబైదీల సంఖ్య 150 వరకు పెరిగింది మేమంతా సామాన్య ఖైదీలం కనుక గదులు శుభ్రం చేసుకోవడం మాత్రమే మా పని అందువల్ల మేము జైలు సూపరింటెండెంటును ఏమైనా పని యిమ్మని కోరాము అందుకు ఆయన అంగీకరించలేదు. నేను మీకు పని అప్పగించితే నాకు శిక్ష పడుతుంది కావున గదులు ఎక్కువ సేపు పరిశుభ్రం