పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

169


ధరించారు. అది నాకు యిష్టంకాకపోయినా, యిట్టి విషయంలో పట్టుదల అనవసరమని భావించాను. రెండు, మూడు రోజులకు సత్యాగ్రహఖైదీల సంఖ్య బాగా పెరిగిపోయింది. వారు కావాలనే శిక్ష పొంది జైలుకు వచ్చారు వారిలో ఎక్కువ మంది కేకలు పెట్టి వస్తువులు అమ్ముకునే వారే దక్షిణాఫ్రికాలో యిలా వీధుల వెంట తిరిగకేకలు బెట్టి వస్తువులు అమ్ముకునే వారు తెల్లవారైనా సరే నల్లవారైనా సరే ప్రభుత్వం దగ్గర అనుమతి పత్రం తీసుకోవాలి. దాన్ని తమ దగ్గర భద్రంగా వుంచుకోవాలి పోలీసులు ఆడిగినప్పుడు వాళ్లకు చూపిస్తూ వుండాలి. రోజూ పోలీసులు అలా అడిగి చూపించని వారిని జైల్లో పెడుతూ వుంటారు. మమ్ము నిర్బంధంలోకి తీసుకున్న తరువాత భారతీయులంతా జైళ్లకు వెళ్లాలని నిశ్చయించుకొన్నారు వారిలో అధిక సంఖ్యాకులు యిట్టి వ్యాపారస్థులే అరెస్టు కావడం వాళ్లకు తేలికే అనుమతి పత్రం చూపించకపోతే చాలు వాళ్లను వెంటనే జైలుకు పంపుతారు. ఒక్క వారంలో యిట్టి ఖైదీల సంఖ్య 100కు పెరిగింది. రోజూ ఖైదీలు వస్తూ వున్నారు. కనుక పత్రికల అవసరం లేకుండా బయటి సమాచారం మాకు అందుతూనే వున్నది. యీ విధంగా రోజు రోజుకీ సత్యాగ్రహుల సంఖ్య పెరుగుతూ వుండే సరికి మేజిస్ట్రేటుకు క్రొత్త ఆదేశం అందింది. యిక సత్యాగ్రహులకు సామాన్య ఖైదు శిక్షకు బదులు కఠోరశిక్ష విధించమనునదే ఆ ఆదేశం అప్పటి నుంచి అందరికీ కఠోరశిక్ష విధించారు. తరువాత జరిగిన పోరాటాల్లో పాల్గొన్న వందలాది భారతీయ సత్యాగ్రహులకు, వాళ్లు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే సామాన్య ఖైదుకు బదులు కఠోర శిక్షయే విధించారు. అయినా భారతీయులు అధిక సంఖ్యలో జైళ్లకు రావడం గొప్ప చమత్కారమే

జోహన్సు బర్గ్ జైల్లో వున్న ఖైదీలకు రోజూ ఉదయం మొక్కజొన్నల పిండితో తయారుచేసిన సంకటియో లేక గంజియో ఉప్పు కలపకుండా అందజేసే వారు ఉప్పు విడిగా అందజేసేవారు. మధ్యాహ్నం 12 గంటలకు నాలుగు ఔన్సులు అన్నం, విడిగా కొద్ది ఉప్పు, ఒక ఔన్సు నెయ్యి, నాలుగు