పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

173

భారతీయులు స్వేచ్ఛగా తమ అనుమతి పత్రాలు మార్చుకోవాలి యీ పనిని చట్టం ప్రకారం చేయడానికి వీలు లేదు. ఆ పత్రంలో వ్రాసే విషయాన్ని భారతీయులతో చర్చించి ప్రభుత్వం తయారు చేస్తుంది. భారతీయులు స్వేచ్ఛగా పత్రాలు తీసుకుంటే. ప్రభుత్వం రక్తపు చట్టాన్ని రద్దు చేస్తుంది. స్వేచ్ఛగా తీసుకున్న అనుమతి పత్రాలకు చట్టబద్ధత కల్పించుటకు క్రొత్త చట్టాన్ని ప్యాసు చేస్తుంది. యిదీ ఆ ముసాయిదా సారాంశం అయితే రక్తపు చట్టాన్ని రద్దు చేస్తుంది అని స్పష్టంగా వ్రాసి లేదు ఆ మాట స్పష్టంగా వ్రాయాలని చెప్పాను

శ్రీ ఆల్బర్ట్ కార్ట్ రైట్‌కు యీ మాత్రం మార్పు చేయడం కూడా యిష్టం కాలేదు. "ఈ ముసాయిదాయే చివరిదని జనరల్ స్నట్స్ చెప్పారు. నేను కూడా స్వయంగా దీన్ని అంగీకరించాను ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నాను మీరంతా స్వేచ్ఛగా పత్రాలు తీసుకుంటే రక్తపు చట్టం రద్దయినట్లేనని భావించండి" అని అన్నాడు

"ఒడంబడిక జరిగినా, జరుగక పోయినా, మీరు చూపిన సానుభూతికి, మీరు చేసిన సహాయానికి సదాకృతజ్ఞులంగా వుంటాము నేను ముసాయిదాలో అనవసరమైన మార్పు ఒక్కటికూడా కోరలేదు ఏ భాషవల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ రక్షింపబడుతుందో దాన్ని నేను వ్యతిరేకించను కాని స్వయంగా నాకే ఆర్ధాన్ని గురించి సందేహం కలిగితే ఆ భాషను మార్చమని సూచించవలసిందే కదా! ఒడంబడిక జరగాలంటే రెండు పక్షాలకు, ముసాయిదాలో మార్పు చేసే అధికారం వుండితీరాలి యీ ముసాయిదాయే చివరిది అని జనరల్ స్మట్సు మా ఎదుట పిస్తోలు ఎక్కుపెట్టకూడదు. రక్తపు చట్ట రూపంలో మా వైపు పిస్తోలును ఎక్కు పెట్టి వుంచారు. అట్టి స్థితిలో రెండోపిస్తోలును ఎక్కుపెడితే దానికి విలువ ఏముంటుంది అని నేను అన్నాను

శ్రీ కార్ట్‌రైట్ నాయీ మాటను కాదనలేక పోయారు. నేను సూచించిన మార్పును జనరల్ స్మట్సుకు తెలియజేస్తానని అంగీకరించారు

జైల్లో నాతో బాటు వున్న వారినందరినీ పిలిచి వివరమంతా చెప్పాను వారికి కూడా ముసాయిదా యందలి భాష నచ్చ లేదు. అయితే మీరు