పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

159


ఎన్నో సౌకర్యాలు కలిగాయి జాతికి తేలికగా సత్యాగ్రహ సమరాన్ని గురించిన శిక్షణ యివ్వగలిగాము, ప్రపంచంలో వున్న భారతీయులందరికీ సత్యాగ్రహ సంగ్రామ ఘట్టాల్ని గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందించగలిగాము మరో సాధనం వల్ల యింత సౌకర్యం కలిగి యుండేది కాదు. సత్యాగ్రహ సంగ్రామం సాగించుటకు ఎన్నో సాధనాలు ఉపయోగపడ్డాయి. కామి వాటన్నింటిలోను ఇండియన్ ఒపీనియన్ గొప్ప సాధనంగా ఉపయోగపడిందని చెప్పకతప్పదు

సంగ్రామం జరిగిన రోజుల్లోను, సంగ్రామం జరిగిన తరువాత జాతిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అదే విధంగా ఇండియన్ ఒపీనియన్ పత్రికలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట, పత్రికకు విజ్ఞాపనలు తీసుకొనేవారు ప్రెస్సులో బయటివారి అచ్చు పనులు కూడా చేసేవారు. ఈ రెండు పనులకు మంచిపని వాళ్లను వినియోగించవలసి వచ్చింది. ఏరకమైన విజ్ఞాపనలు తీసుకోవాలి ఏ రకం విజ్ఞాపనలు తీసుకోకూడదు అను విషయంలో ధర్మసంకటం ఏర్పడింది. అంతేగాక ప్రకటించకూడని విజ్ఞాపనలు అందినప్పుడు, ఆ విజ్ఞాపనలు యిచ్చిన వాడు అగ్రగణ్యుడగు భారతీయుడైనప్పుడు, అతణ్ణి సంతోషపెట్టుటకు పనికిమాలిన విజ్ఞాపనలు తేవడానికి, ప్రచురించిన విజ్ఞాపనల డబ్బు వసూలు చేసి తెచ్చుకోడానికి వ్యక్తిత్వం కలిగిన మాపనివాళ్లు చాలా సమయం వెచ్చించవలసిన అవసరం ఏర్పడింది. విజ్ఞాపనలకోసం దాతల భజన చేయవలసి వచ్చేది అసలు పత్రికను ఎందుకు నడుపుతున్నాం? డబ్బు సంపాదించడానికా లేక జాతికి సేవచేయుటకా? సేవచేయడానికే అయితే ఎవ్వరినీ వత్తిడిచేయకూడదుకదా! జాతి కోరితేనే సేవ చేయాలి అయితే జాతి ఎలా కోరుతుంది? స్వయంగా చందా చెల్లించి చందాదారులుగా చేరడమే జాతికోరికకు తర్కాణం అవుతుంది. విజ్ఞాపనలకోసం దాతల చుట్టూ తిరగడంమాని పత్రికా ప్రచురణకు అయ్యే ఖర్చు చందాదారులను చేర్చి తద్వారాభరించడం మంచిది. దీనివల్ల ఆకర్షించేవారికి, ఆకర్షింపబడేవారికి యిరువురికీ పాఠం నేర్పినట్లవుతుంది ఈ విషయాలన్నింటినీ యోచించి