పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ఇండియన్ ఒపీనియన్


వెంటనే నిర్ణయాన్ని అమలు పరిచాము విజ్ఞాపనలకోసం తెగతిరిగేవారంతా శ్వాసపీల్చుకొని, పత్రికను ఉపయోగకరంగాను. అందంగాను తీర్చిదిద్దుటకు కృషి ప్రారంభించారు. జాతి ప్రజలకు ఇండియన్ ఒపీనియన్ పత్రిక తమదేనని, దానిని నడపడం తమ బాధ్యతయేనని బోధపడింది. కార్యకర్తలమంతా ఆనందించాము జాతిప్రయోజనాన్ని దృష్టియందుంచుకొని జనం పత్రికకోసం ఎదురుచూచే విధంగా పత్రికను రూపొందించే కృషికి ఆంతా పూనుకున్నాము ప్రతి భారతీయుణ్ణి నిలబెట్టి యీ పత్రికను కొనమని చెప్పడం కార్యకర్తలంతా తమ కర్తవ్యంగా భావించాము అచిరకాలంలోనే ఇండియన్ ఒపీనియన్‌పత్రిక అంతరిక శక్తి బాగా పెరిగింది. పత్రికా స్వరూపంలో కూడా మంచి మార్పు వచ్చింది. అది ఒక శక్తి అయిపోయింది. ఆ పత్రిక చందాదారుల సంఖ్య సామాన్యంగా 1200 నుంచి 1500 వరకు వుండేది పత్రిక వార్షిక చందా పెంచవలసి వచ్చింది. సత్యాగ్రహసంగ్రామం ఉగ్రరూపం దాల్చినప్పుడు వార్షికచందాదారుల సంఖ్య 3500 దాకా పెరిగింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికా పాఠకుల సంఖ్య 20,000వరకు వుండేది. ఇంతమంది పారకుల కోసం 3000 కంటే మించి విడి ప్రతులు అమ్మకం కావడం విశేషమే

ఇండియన్ ఒపీనియన్ పత్రికను భారతజాతి తమదిగా భావించింది పత్రికాప్రతులు జోహాన్స్‌బర్గుకు కొంచెం ఆలస్యంగా చేరితే జనం ఊరుకునేవారుకాదు. ఆదివారం ఉదయం పత్రికాప్రతులు జోహాన్స్‌బర్గుకు చేరుతూవుండేవి. పత్రికలు చేరగానే జనం ముందుగా గుజరాతీ పత్రిక తీసుకొని గబగబా పత్రికనంతటనీ చదివేస్తూ వుండేవారు. ఒకడు చదువుతూవుంటే, పది పదిహేనుమంది చుట్టూ నిలబడివింటూ వుండేవారు బీదవాళ్లు ముగ్గురు నలుగురు కలిసి పత్రిక కొని చదివేవారు

విజ్ఞాపనల్ని ఆపివేసినట్లే, ప్రెస్సులో బయటి అచ్చుపనులు తీసుకోవడం కూడా ఆపివేశాము విజ్ఞాపనలు తీసుకోకపోవడానికి ఏ కారణాలు పనిచేశాయో, అచ్చుపనులు తీసుకోకపోవడానికి కూడా అవే కారణాలు పనిచేశాయి. అందువల్ల కంపోజిటర్లకు సమయం చిక్కినందున పుస్తక