పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఇండియన్ ఒపీనియన్


నాజర్ ఆ పత్రికకు గౌరవ సంపాదకుడుగా వున్నారు. పత్రిక ప్రచురణు వల్ల నష్టం రాసాగింది. అప్పుడు ప్రెస్సులో పనిచేసే వారందరినీ అందు భాగస్వాములుగా చేసి, ఒక పొలం తీసుకొని అక్కడ వారందరికీ నివాసం ఏర్పాటు చేసి పత్రిక నడపించాలని నిర్ణయానికి వచ్చారు. ఆ పొలం డర్బనుకు 13 మైళ్ల దూరాన ఒక అందమైన పర్వతం మీద వున్నది. దానికి అతి దగ్గరలో 3 మైళ్ల దూరాన రైలు స్టేషను వున్నది. దాని పేరు ఫినిక్స్ పత్రిక పేరు మొదటి నుంచి ఇండియన్ ఒఫీనియస్ అని పెట్టారు ఒకప్పుడు యిది ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, తమిళభాషల్లో వెలువడింది తమిళం, హిందీ పత్రికల ప్రచురణ భారం బాగాపెరిగిపోయింది. పొలానికి వచ్చి వుండే పని వాళ్లు దొరకలేదు. తమిళ హిందీ భాషల్లో వ్రాసేవారు. వ్రాసిన వ్యాసాల్ని సరిదిద్దువారు లేకపోయినందున ఆ రెండు శాఖల్ని ఆపివేశారు. ఇంగ్లీషు, గుజరాతీ భాషల్లో మాత్రం పత్రిక వెలువడసాగింది సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభమైనప్పుడు యీ రెండు భాషల్లోనే పత్రిక తెలువడుతూ వున్నది. పొలంలో వుంటూ సంస్థలో పనిచేసే వారిలో హిందీ (ఉత్తరప్రదేశ్). తమిళ్ (మద్రాసు), గుజరాతీ, ఇంగ్లీషు వాళ్లంతా వున్నారు శ్రీ మనసుఖలాల్ నాజర్ హరాత్తుగా మృతి చెందారు. అప్పుడు ఒక ఆంగ్ల మిత్రుడు హర్బర్ట్‌కిచన్ ఇండియన్ ఒపీనియస్ పత్రికకు సంపాదకులైనారు తరువాత శ్రీ హెనరీపోలక్ చాలా కాలం వరకు సంపాదకులుగా పున్నారు నేను, పోలక్ యిద్దరం జైల్లో వున్నప్పుడు ఫాదరీ కీ. శే. జోసఫ్ డోక్ పత్రికకు సంపాదకులుగా వున్నారు. ఈ పత్రిక ద్వారా భారతీయులందరికీ, జరుగుతున్న సమాచారం పూర్తిగా అందజేయుటకు అవకాశం లభించింది. ఇంగ్లీషు విభాగం ద్వారా గుజరాతీ రానివారికి కూడా సత్యాగ్రహ విశేషాలు తెలిపి శిక్షణ యివ్వడం ప్రారంభమైంది. ఇండియా, ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా యందలి తెల్ల జాతీయులకు ఇండియన్ ఒపీనియన్ సాప్తాహిక పత్రికగా రూపొంది వారి అవసరాలు తీర్చసాగింది. పత్రిక లేకుండా కూడా సత్యాగ్రహం వంటి సమరం సాగించవచ్చు కాని ఇండియన్ ఒపీనియన్ పత్రికవల్ల మాకు