పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

157


వుంచుకోగలడు. కాని దాన్ని సమూలంగా పెకిలించి పారవేయలేడు. సృష్టికర్త మనిసికి అంతశక్తి ప్రసాదించలేదు. పెద్దపులి తన చర్మం చారలను మార్చుకోగలిగితే మనిషి తన విచిత్ర స్వభావాన్ని మార్చుకోగలుగుతాడు పారిపోయినప్పటికీ రామ్‌సుందర్ తన బలహీనతలకు ఎంత పశ్చాత్తాప పడివుంటాడో మనకు ఎలా తెలుస్తుంది? అతడు పారిపోవడాన్ని అతడి పశ్చాత్తాపానికి తార్కాణంగా భావించ వచ్చుకదా? అతడు సిగ్గులేనివాడైతే పారిపోవలసిన అవసరం వుండేది కాదు అనుమతి పత్రం తీసుకొని, రక్తపు చట్టాన్ని అంగీకరించి జైలుకు పోకుండా ముక్తి పొందియుండేవాడు ప్రభుత్వం చేరువకు చేరి యుండే వాడుకూడా ఏషియాటిక్ ఆఫీసుకు దళారిగా మారి యితర భారతీయుల్ని సైతం మార్చివేసేవాడు. ఇదంతా ఏమీ చేయకుండా జాతికి తన దౌర్బల్యాన్ని చూపించుటకు సంకోచించి, సిగ్గుపడి, తన ముఖం దాచుకున్నాడు. ఇలా చేసి భారతజాతికి అతడు మేలే చేశాడు అతడు పారిపోవడాన్ని యీ విధంగా అర్థం చేసుకుంటే మంచిది



19

ఇండియన్ ఒపీనియన్

నేను పాఠకులకు సత్యాగ్రహానికి సంబంధించిన లోపలి మరియు బయటి సాధనాలన్నింటిని గురించి తెలియజేయాలని, భావిస్తున్నాను అందువల్ల ఇండియన్ ఒపీనియన్ అను వార పత్రికను గురించి వివరిస్తాను అది యిప్పటికీ దక్షిణాఫ్రికానుంచి వెలువడుతున్నది. దక్షిణాఫ్రికాలో ప్రప్రధమంగా హిందుస్తానీ ప్రెస్ ప్రారంభించిన ఘనత శ్రీ మదనజీత్ వ్యావహారిక్ అను గుజరాతీ సజ్జనుడికి దక్కింది. అనేక యిబ్బందులు పడి ప్రెస్ నడుపుతూ ఒక వారపత్రిక ప్రచురించాలనే నిర్ణయానికి అతడు వచ్చాడు. ఈ విషయంలో అతడు కీ. శే. మనసుఖలాల్ నాజర్ మరియు నా సలహా కోరాడు. దర్బన్ నుంచి పత్రిక ప్రారంభమైంది. శ్రీ మనసుఖలాల్