పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

ప్రధమ సత్యాగ్రహఖైదీ


పారిపోవడం రామసుందర్ చేసిన అపరాధమే ఇక్కడ రామసుందర్ పండిత్ కధ. అతనికి సంబంధించిన వివరం ఆతణ్ణి తప్పు పట్టాలనే ఉద్దేశ్యంతో నేను పేర్కొనలేదు. ఇందు దాగియున్న గూఢరహస్యాన్ని తెలుపుటకే పేర్కొన్నాను పరిశుద్ధహృదయంతో ఆరంభించిన ఏ ఉద్యమంలోనైనా సరే పరిశుద్ధమైన ఆచరణ కలవారినే చేర్చుకోవాలి. అయితే ఎంత జాగ్రత్తపడ్డా పరిశుద్ధంగా జరిగే ఉద్యమంలో ఆపరిశుద్ధ మనష్యులు కూడా చేరుతూ వుంటారు. అయితే నాయకులు సదా జాగరూకులై వుండాలి సంచాలకుడు పరిశుద్ధుడై యుంటే యిలాంటి వాళ్ల వల్ల ఉద్యమం దెబ్బతినదని మనవి చేస్తున్నాను రామసుందర్‌పండిత్ నిజస్వరూపం బైటపడే సరికి జాతికి అతిని యెడ గలగౌరవం పూర్తిగా తగ్గిపోయింది. పండిత్‌రూపం పోయి అతడు కేవలం రామసుందర్‌గా మిగిలిపోయాడు జాతి అతణ్ణి మరిచి పోయింది కాని దీనివల్ల పోరాటానికి బలం పెరిగింది సత్యాగ్రహిగా అతడు అనుభవించిన జైలు శిక్ష వృధాకాలేదు. అతడు జైలుకు వెళ్లి నందున పెరిగిన జాతి బలం తరగలేదు అతడి బలహీనత వల్ల కలిగిన ఫలితాన్ని చూచి అటువంటి బలహీనులంతా పోరాటాన్ని వదిలి పారిపోయారు. ఇటువంటి యింకా కొంతమంది బలహీసుల బలహీసతలు జూతికంటబడ్డాయి. కాని నేను వారిని గురించి పేర్లు అడ్రసులతో సహా యిక్కడ వివరించదలచలేదు. అందువల్ల కలిగే లాభమూ ఏమీ లేదు. జాతి యొక్కశక్తిని మరియు జాతి యొక్క బలహీనతను పాఠకులు గ్రహించాలి రామసుందర్ వంటివాళ్లు ఎంతో మంది వస్తారు. వెళ్తారు. అయినా జాతి బలం చెక్కు చెదరదు అటువంటి వాళ్లవల్ల కూడా జాతికి బలమే చేకూరుతుందని నా అభిప్రాయం పాఠకులు రామసుందర్‌ను దోషిగా భావించకూడదు. ఈ జగత్తు నందలి మనుష్యులంతా అపూర్ణులే ఒక వ్యక్తి యొక్క అపూర్ణత్వం స్పష్టంగా కనబడినప్పుడు మిగతా వారంతా అతడిని వ్రేలెత్తి చూపిస్తూవుంటారు. కాని నిజానికి అది మన పొరపాటే అవుతుంది. వాస్తవానికి రామసుందర్ తెలిసియుండి బలహీనుడు కాలేదు. మనిషి తన స్వభావాన్ని మార్చుకోగలడు దాన్ని అధీనంలో