పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

147


ముహమ్మద్ కాఛలియా ఒకరు వారిని ఒక కక్షిదారుడుగాను, రెండు భాషలు వచ్చిన దుబాసిగాను నేను ఎరుగుదును వారు. ప్రజా కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొనలేదు వారికి ఇంగ్లీషు బాష కొద్దిగా వచ్చు అనుభవంద్వారా ఆభాషా జ్ఞానాన్ని బాగా పెంచుకున్నారు. మమ్మల్ని తన ఆంగ్లవకీళ్ల దగ్గరికి తీసుకు వెళ్లినప్పుడు యిద్దరి మధ్య తానే దుబాసిగా వ్యవహరించే వారు అయితే వృత్తిగా గాక, ఒక మిత్రునిగా దుబాసిపని చేస్తూవుండే వారు బట్టలు అమ్మకం చేస్తూ తరువాత తన సోదరునితో కలిసి భాగస్వామిగా వుండి చిన్నస్థాయిలో వ్యాపారం ప్రారంభించారు. ఆయన సూరత్‌కు చెందిన మేమన్‌జాతి వారు సూరత్ జిల్లాలో జన్మించారు సూరత్‌కి చెందిన మేమన్ తెగవారికి ఆయనంటే గౌరవం ఆయనకు గుజరాతీ కొద్దిగా వచ్చు కాని అనుభవం ద్వారా యీ భాషాజ్ఞానాన్ని కూడా బాగా పెంచుకున్నారు. వారి బుద్ధిమాత్రం కడు చురుకైనది ఏ విషయాన్నైనా యిట్టే గ్రహించి వేసేవారు కోర్టు కేసుల యందలి చిక్కుముడుల్ని విప్పదీయడంలో ఆయన ప్రతిజ్ఞచూచి నేను చాలా సార్లు నివ్వెరబోయాను వకీళ్లతో సైతం చట్ట నిబంధనల్ని గురించి నిశితంగా చర్చిస్తూ వుండేవారు. వకీళ్లు సైతం ఆయన వాదనల్ని విని వాటిని గురించి శ్రద్ధ వహించేవారు. ప్రతాపంలోగాని, నిష్ఠవిషయంలో గాని ఆయనను మించిన వ్యక్తిని నేను దక్షిణాఫ్రికాలోగాని, భారతదేశంలో గాని చూడలేదు. జాతి హితంకోసం ఆయన తన సర్వమూ త్యాగం చేశారు ఆయన సంభాషించిన ప్రతిసారి ఏకవచన ప్రయోగం చేస్తూ వుండేవారు ఆయన నిష్టకలిగిన మహమ్మదీయుడు సూరత్‌కు చెందిన మేమన్ల మసీదుకు సంబంధించిన ట్రస్టీలలో ఆయన కూడా ఒకరు. అయితే హిందూ మహమ్మదీయుల్ని సమంగా చూచేవారు. సమస్యలు వచ్చినప్పుడు మత మౌఢ్యంతో ముస్లిములను సమర్ధించి ఆయన హిందువులను తెగడిన ఘట్టం ఒక్కటి కూడా లేదు. నిర్భయుడు నిష్పక్షపాతి అందువల్ల అవసరమైనప్పుడు హిందువులకు. మహమ్మదీయులకు వారి వారి దోషాలు చెప్పడానికి వెనుకంజ వేసేవాడు కాడు ఆయన చూపించిన నిరాడంబరత్వం, అభిమాన