పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

అహమద్ ముహమ్మద్ కాఛలియా


రాహిత్యం అనుసరించుటకు అనుకూలమైనవి ఎన్నో సంవత్సరాల గాఢ పరిచయం వల్ల కీ. శే. అహమద్ కాఛలియా వంటి పురుషుడు భారత జాతికి లభించడం గొప్ప విశేషంగా నేను హృదయపూర్తిగా భావిస్తున్నాను ప్రిటోరియాలో ఉపన్యసించిన వారిలో ఆ నరపుంగవుడు కూడా వున్నాడు. ఆయన క్లుప్తంగా ఉపన్యాసం యిచ్చాడు. "ప్రతి భారతీయునికి యీ ఖూనీ చట్టం ఏమిటో తెలుసు దాని అర్ధం మనందరికీ తెలుసు శ్రీ హాస్కిన్ ప్రసంగం శ్రద్ధగా విన్నాను. మీరంతా కూడా విన్నారు. నాపై ఒక్క ప్రభావం పడింది. వారి ప్రసంగం విన్న తరువాత నేను చేసిన ప్రతిజ్ఞ యింకా గట్టి పడింది ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు అయితే యీ ఖూనీ చట్టం కంటే మించి యింక వాళ్లు చేసేది ఏమిటి ఈ ప్రభుత్వం మనల్ని జైళ్లలో పెడుతుంది మన ఆస్థుల్ని జప్తుచేసి అమ్మివేస్తుంది. మనల్ని దేశాన్నుంచి బహిష్కరిస్తుంది. ఉరితీస్తుంది. వీటన్నింటిని నవ్వుతూ మనం సహించగలం, కాని యీ ఖూనీ చట్టాన్ని మాత్రం సహించం సహించలేము అంటూ ప్రసంగం ముగించాడు. ఆ సమయంలో అతడు పొందిన ఉత్తేజాన్ని నేను జాగ్రత్తగా గమనించాను ఆయన ముఖం ఎర్రబడింది. ఆయన సిరస్సు, ముఖమందలి నరాలు రక్త ప్రసారం వల్ల ఉబ్బాయి ఆయన శరీరం వణికింది. తన కుడిచేతివ్రేళ్లను కంఠం మీద నిమురుతూ ఒక్కసారిగా గర్జించాడు. 'నేను ఖుదాను సాక్ష్యంగా పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను ఒట్టుపెట్టుకుంటున్నాను ప్రాణాలైనా అర్పించివేస్తాను కాని యీ ఖూనీ చట్టం ఎదుట తలవంచను ఈ సభకూడా యిట్టి నిర్ణయమే చేయాలని కోరుతున్నాను " అంటూ ఆయన కూర్చున్నాడు. తన కంఠం మీద కుడి చేతివ్రేళ్లను నిమురుతూ వున్నప్పుడు కొందరు చిరునవ్వు నవ్వడం నేను చూచాను నేను కూడా వారితో కలిసి చిరునవ్వు నవ్వాను మాటల్లో చూపినంతశక్తి చేతల్లో కాఛలియా చూపించగలడా అనే సందేహం నాకు కలిగింది. ఆ సందేహాన్ని గురించి వ్రాస్తున్నప్పుడు యిలా ఎందుకు వ్రాశానా అని నాకు సిగ్గువేస్తున్నది అమహాసంగ్రామంలో తమ ప్రతిజ్ఞను అక్షరశ: పాలించిన భారతీయులందరిలో