పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

అహమద్ ముహమ్మద్ కాఛలియా


ఘనంగా స్వాగతం పలికింది. ఆయన ప్రసింగిస్తూ "నేను మీకు మిత్రుణ్ణి మీకందరికీ యీ విషయం తెలుసు నా సానుభూతి మీయెడ కలదని చెప్పనవసరం లేదని భావిస్తున్నాను నాకు శక్తి వుంటే మీ కోరికలన్నింటిని అంగీకరింప చేయాలని వున్నది. అయితే యిక్కడి సామాన్య తెల్లవారి వ్యతిరేకతను గురించి వేరే మీకు చెప్పనవసరంలేదని అనుకుంటున్నాను ఇవాళ నేను మీ దగ్గరికి జనరల్ బోధా కోరినందున వచ్చాను వారి సందేశం మీకు వినిపిస్తున్నాను. భారత జాతి అంటే ఆయనకు గౌరవం వున్నది భారత జాతి భావాలు ఆయనకు తెలుసు అయినా ఆయన నేను ఏమీ చేయలేని స్థితిలో వున్నాను ట్రాన్స్‌వాల్ యందలి తెల్లవారంతా యిట్టి చట్టం అవసరమని భావిస్తున్నారు. భారత జాతి చేయవలసిందంతా చేసింది గౌరవాన్ని రక్షించుకున్నది. అయినా భారతజాతి కోరిక నెరవేరలేదు. చట్టం ప్యాసైంది. ఇక భారత జాతి యీ చట్టాన్ని అంగీకరించి తమ విశ్వాసపాత్రతను, శాంతి స్వభావాన్ని వెల్లడించడం అవసరం ఇక యీ చట్టమందలి కొద్ది చిన్న పెద్ద నిబంధనల్లో మార్పు అవసరమని భావిస్తే స్మట్స్ వినడానికి సిద్ధంగా వున్నారు అని చెప్పాడు. ఈ విధంగా, జనరల్ బోధా సందేశాన్ని చెప్పి శ్రీ హాస్కిన్ మీరు జనరల్ బోధా సలహాను విని పాటించమని నాపక్షాన చెబుతున్నాను ప్రభుత్వం యీ చట్టం మీద గట్టిగా నిలిచియుందని నాకు తెలుసు ప్రభుత్వాన్ని ఎదిరించడమంటే తలను గోడకు కొట్టుకున్నట్టే అవుతుంది. భారత జాతి చట్టాన్ని వ్యతిరేకించి అనవసరంగా కష్టాల్నికొని తెచ్చుకోవద్దని, నాశనం కావద్దని సలహా యిస్తున్నాను అని చెప్పాడు. వారిచ్చిన ఉపన్యాసాన్ని అక్షరం అక్షరం అనువదించి నేను జనానికి వినిపించాను. నా పక్షాన కూడా జనాన్ని హెచ్చరించాను. చప్పట్ల ధ్వని మధ్య శ్రీ హాస్కిన్ సభ నుంచి వెళ్లిపోయాడు

ఇక సభలో భారతీయుల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రకరణానికే గాక, నిజానికి ఈ చరిత్రకే నాయకత్వం వహించిన నాయకుణ్ణి ఇక పరిచయం చేస్తున్నాను సభలో ప్రసంగించిన వారిలో కీ. శే. అహమద్