పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

145


పెద్ద సంఖ్యగా పరిగణింపబడుతుంది. సామూహికంగా జరిగే సత్యాగ్రహాన్ని మరే షరతు మీద జరుపుటకు వీలు లేదు. ఏ సత్యాగ్రహం కేవలం అందులో పాల్గొను సత్యాగ్రహుల శక్తిపై ఆధారపడి నడుస్తుందో, ఆసత్యాగ్రహాన్ని గురించిన శిక్షణ వారికి గరఫకపోతే అది నడవదు. అందువల్ల యింత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న జనాన్ని చూచి మేము ఆశ్చర్యపడ లేదు బహిరంగ సభలు విశాల మైదానాల్లోనే జరపాలని నిర్ణయించాము అందువల్ల డబ్బు అధికంగా ఖర్చు కాలేదు చోటు లేనందున ఎవ్వరూ తిరిగి వెళ్లిపోవలసిన అవసరం కలుగలేదు. మరో విశేషాన్ని కూడా పేర్కొనడం అవసరం మా సభలన్నీ ప్రశాంతంగా నడిచాయి. సభలో పాల్గొనే జనం ఉపన్యాసాలన్నింటిని శ్రద్ధగా విన్నారు. సభ ప్రాంగణంలో చిపర నిలబడి వున్న వాళ్లకు ఉపన్యాసం వినబడకపోతే బిగ్గరగా మాట్లాడమని వక్తల్ని, కోరుతూ వుండేవారు. ఇట్టి సభల్లో కుర్చీలు వుండేవి కావని పాఠకులు గ్రహింతురుగాక అంతా నేల మీదనే కూర్చోనేవారు చిన్న వేదిక మాత్రం ఏర్పాటు చేసేవాళ్లం దాని మీద సభకు అధ్యక్షత వహించే అధ్యక్షుడు. ఉపన్యాసం యిచ్చే వక్త, మరిద్దరు ముగ్గురు ముఖ్యలు వుండేవారు. ఆ వేదిక మీద ఒక చిన్న టేబులు, రెండు మూడు కుర్చీలు, స్టూళ్లు వుండేవి

ప్రిటోరియాలో జరిగిన యీ సభకు అధ్యక్షత. బ్రిటీష్ ఇండియన్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు అయిన యూసఫ్ ఇస్మాయిల్‌మియా వహించారు. ఖూనీ చట్ట ప్రకారం అనుమతి పత్రాలు తీసుకోవలసిన గడువు సమీపిస్తున్నది. అందువల్ల ఆవేశం ఎంత వున్నా భారతీయులు మాత్రం చింతా క్రాంతులైనారు. అదే విధంగా శక్తి సామర్థ్యాలు ఎన్ని వున్నా జనరల్ బోధా జనరల్ స్మట్సులు కూడా పైకి బుకాయిస్తున్నా లోలోపల అమిత చింతా క్రాంతులైనారు. ఒక జాతినంతటినీ బలవంతంగా వంచి అణచడం ఎవ్వరికీ సాధ్యం కానిపని అందువల్ల జనరల్ బోధా యీ సభలో మాకు నచ్చచెప్పమని శ్రీ . విలియం హాస్కిన్‌ను పంపించాడు. శ్రీ హాస్కిన్‌ను పదమూడవ ప్రకరణంలో పాఠకులకు పరిచయం చేశాను సభ శ్రీవిలియం హాస్కిన్‌కు