పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

141


చేయాలని ప్రకటన వెలువడింది. మధ్య యిన్ని రోజుల గడువు భారతీయులపై దయతో యివ్వబడలేదు. ఆచట్టానికి సామ్రాజ్య ప్రభుత్వ ముద్ర అవసరం అందుకు సమయం కావాలి గదా1 అంతేగాక అందు కోసం ఫారాలు, పుస్తకాలు, అనుమతి పత్రాలు తయారు చేయాలి వేరు వేరుచోట్ల ఆఫీసులు తెరవాలి. దానికోసం కొద్ది గడువు ఇచ్చారు



16

అహమద్ ముహమ్మద్ కాఛలియా

మా భారతీయుల ప్రతినిధి బృందం సభ్యులం ఇంగ్లాండు వెళ్లుటకు బయలు దేరాం అప్పుడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న ఒక ఆంగ్లేయ యాత్రీకుడు వచ్చి నన్ను కలిశాడు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం అమలు చేసిన ఖానీ చట్టాన్ని గురించి మా ఇంగ్లాండు ప్రయాణాన్ని గురించి నావల్ల తెలుసుకొని "అయితే మీరు కుక్కబెల్టు (డాగ్ కాలర్) ధరించడాని వ్యతిరేకిస్తున్నారన్నమాట" అని అన్నాడు. ఆ ఆంగ్లేయుడు ట్రాన్స్‌వాల్ ప్రభుత్వపు చట్టాన్ని కుక్కబెల్టుతో పోల్చాడన్నమాట అతడు ఆ మాట ఖూనీ చట్టాన్ని సమర్ధిస్తూ, భారతీయుల యెడ తనకు గల తిరస్కార భావాన్ని వెల్లడించడానికే అన్నాడో, లేక దక్షిణాఫ్రికా యందలి భారతీయుల విషయంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వాన్ని ఎమర్శిస్తూ, మా యెడ సానుభూతిని ప్రకటిస్తూ అన్నాడో అప్పుడు నేను నిర్ణయానికి రాలేకపోయాను ఇప్పుడూ రాలేకపోతున్నాను ఆయితే ఏ మనిషి మాట్లాడిన మాటకైనా అతడికి అన్యాయం జరిగేలా అర్థం తీయకూడదని నా అభిప్రాయం అట్టి నీతిసూత్రం ప్రకారం భారతీయుల యెడ సానుభూతిని ప్రకటించేందుకు వాస్తవ స్థితిని యీ మాటల్లో చిత్రించాడని భావిస్తున్నాను. ఒక వైపున ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం భారతీయులకు కుక్క బెల్టు కట్టుటకు ప్రయత్నిస్తూ వుంటే, మరో వైపున యీ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవడమా, బెల్టు ధరించకుండా ప్రభుత్వ వక్రనీతిని ఎలా