పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

అహమద్ ముహమ్మద్ కాఛలియా


ఎండగట్టడమా అని భారతజాతి కృషి చేస్తున్నది. ఇంగ్లాండు. భారతావని యందలి సహాయకులగు మిత్రులందరికీ అక్కడి పరిస్థితిని తెలుపుతూ జాబులు వ్రాస్తూ వున్నాము అసలు సత్యాగ్రహ పోరాటానికి బయటి బలాలకంటే, అంతరంగిక బలమే రామబాణంలా పని చేస్తుంది. కనుక జాతిని జాగృతం చేయుటకు, జనాన్ని క్రియాశూరులుగా తయారుచేయుటకు. జాతినాయకులు తమ సమయాన్ని వెచ్చించ సాగారు

సత్యాగ్రహాపోరాటం జరుపుటకు ఏ సంస్థను ఉపయోగించాలా అను ప్రశ్న బయలుదేరింది. ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ సభ్యుల సంఖ్య చాలా ఎక్కువగా వున్నది చాన్ని స్థాపించి నప్పుడు సత్యాగ్రహ పుట్టుక జరగలేదు. ఒకటి కాదు, రెండు కాదు, పలుచట్టాలకు వ్యతిరేకంగా సంస్థ పోరాడింది. ఇంకా పోరాడవలసిన అవసరం వున్నది. చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటమే గాక, అనేక రాజకీయ సాంఘిక, తదితరరంగాలలో కూడా రకరకాల పనులు ఆ సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ మెంబర్లంతా సత్యాగ్రహపోరాటం ద్వారా ఖూనీ చట్టాన్ని ఎదర్కొంటామని యింకా ప్రతిజ్ఞ గైకొనలేదు. బయటి ప్రమాదాలను గురించి కూడా యోచించవలసిన ఆవసరం వున్నది. సత్యాగ్రహపోరాటాన్ని ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం రాజద్రోహంగా పరగణించి సత్యాగ్రహ పోరాటం సాగించే సంస్థల్ని నిషేధిస్తే? అట్టి స్థితిలో ఆ సంస్థలో పనిచేసే సత్యాగ్రహులు కాని మెంబర్లు ఏంచేయాలి? సత్యాగ్రహం ప్రారంభంకాక పూర్వం సంస్థకు దాతలు యిచ్చిన ధనాన్ని ఏంచేయాలి? వీటికి సమాధానం వెతకాలి సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి అశ్రద్ధ, అశక్తి తదితర కారణాలవల్ల సత్యాగ్రహంలో పాల్గొనని వ్యక్తులను ద్వేషించకూడదని, వాళ్లతో స్నేహంగా వ్యవహరించాలని, సత్యాగ్రహం తప్ప తదితర కార్యక్రమాల్లో వాళ్లతో కలిసి పనిచేయాలని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు

ఇటువంటి పలు సమస్యలను గురించి చర్చించి యిప్పుడున్న సంస్థల ద్వారా సత్యాగ్రహపోరాటం జరపకూడదని, అన్ని సంస్థలు సత్యాగ్రహ