పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

వక్ర రాజనీతి లేక క్షణిక సంతోషం


భారతీయుల యెడ సానుభూతి వున్నట్లు మొసలి కన్నీరు కార్చి. లోలోపున ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాడు. తాను ఆంగీకరించని చట్టాన్ని ప్యాసుచేసి అమలు చేయమని వారిని ప్రోత్సహించాడు. ఇటువంటి వక్ర రాజనీతికి సంబంధించిన ఉదాహరణ యిది ఒక్కటే కాదు. బ్రిటిష్ సామ్రాజ్య చరిత్రను చదివిన సామాన్య పాఠకుడు సైతం ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. జోహన్స్‌బర్గ్ చేరగానే లార్జ్ ఎల్గిన్ మరియు సామ్రాజ్య ప్రభుత్వాధినేతలు మమ్మల్ని మోసంచేశారని విన్నాము మదీనాలో మాకు ఎంత సంతోషం కలిగిందో దక్షిణాఫ్రికాలో అంత నిరాశకలిగింది. ఇట్టి వక్రరాజనీతి వల్ల భారతీయుల్లో ఆవేశం పెల్లుబికింది. "ఇకమనకు చింత ఎందుకు? ఏ సామ్రాజ్య ప్రభుత్వం సహాయం చేస్తుందని మనం పోరాడుతాం? ఇక మన బలం మీదనే, ప్రతిజ్ఞచేసిన ఈశ్వరుని బలం మీదనే ఆధారపడి పోరాడదాం మనం సత్యం మీద నిలబడితే వక్ర రాజనీతి కూడా తిన్నగా మారి సక్రమంగా నడుస్తుంది" అని అంతా అన్నారు

ట్రాన్స్‌వాల్‌లో జవాబుదారీ ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో మొదటి చట్టం బడ్జెటుకు సంబంధించినది. రెండవది రక్తపు చట్టం (ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ ఆక్టు) మొదటసారి యీ ఆక్టును ఎలా ప్యాసుచేశారో యీసారికూడా అలాగే ప్యాసు చేశారు. ఒకటి రెండు శబ్దాలు మాత్రమే మార్చారు ఆ మార్పు ప్రకారం చట్ట నిబంధనలో యివ్వబడిన తేదీలో మార్పు చేశారు. అలా చేయక తప్పదు. 1907 మార్చి 21వ తేదీన ఒకే ఒక్క రోజున రక్తపుచట్టం ట్రాన్స్‌వాల్ అసెంబ్లీలో ప్యాసై పోయింది. పైన తెలిపిన మార్పుకు, చట్టమందలి కఠోరత్వానికి ఏ సంబంధంమూ లేదు అంటే గతంలో యిట్టి చట్టాన్ని నిరాకరిస్తున్నామని చేసిన తతంగమంతా ఒట్టి బూటకమని స్పష్టంగా తేలిపోయింది. భారతీయులు దానికి వ్యతిరేకంగా అర్జీలు పంపించారు కాని పట్టించుకునే నాథుడెవరు? 1907 జూలై 1వ తేదీ నుంచి చట్టం అమలులోకి వచ్చిందని ప్రకటించారు. జూలై 31వ తేదీలోపున భారతీయులందరు అనుమతి పత్రాలు తీసుకునేందుకు ఆర్జీలు దాఖలు