పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

119


కలుగకపోవచ్చు. అయితే ఏదో జరుగుతుందని ఉహించి మనం ప్రతిజ్ఞ చేయకూడదు. మనం సాగించేపోరాటాం వల్ల రెండు కటు పరిణామాలు కలుగవచ్చు. వాటిని మీముందు చెప్పతలుస్తున్నాను. మనందరం ప్రతిజ్ఞ చేశాం అనుకోండి అంతా కలిపి మనం 3000 మందిమి వున్నాం. మిగతా 10వేల మంది భారతీయులు ప్రతిజ్ఞ చేయకపోవచ్చు. అప్పుడు ప్రారంభంలో మనం నవ్వుల పాలవుతాం అంతేగాక ప్రతిజ్ఞ చేసిన వారిలో కూడా కొందరు పిరికితనంతో వెన్నుచూపవచ్చు జైళ్లకు వెళ్ల వలసి రావచ్చు. అక్కడ అవమానాలు సహించడం అవసరం కావచ్చు. ఆకలి, చలి, ఎండల్ని జైళ్లలో అనుభవించవచ్చు. దౌర్జన్యాలకు అలవాటుపడ్డపోలీసు అధికారులు మనల్ని బాదవచ్చు. జుల్మానాలు విధించవచ్చు. మన ఆస్థిపాస్తులు వేలం కూడా వేయవచ్చు. యివాళ మనదగ్గర డబ్బు పుష్కలంగా వున్నా రేవు దరిద్రులం కావచ్చు యీ దేశాన్నుంచి మనల్ని బహిష్కరించవచ్చు. ఆకలిదప్పికలతో మనలో కొందరు. జబ్బు పడవచ్చు. కొందరు చనిపోవచ్చు. అందువల్ల ఉహించ గలిగినన్ని కష్టాల్ని సహించడానికి మనం సిద్ధపడాలి. అప్పుడే ప్రతిజ్ఞ చేయాలి. ఈ పోరాటం వల్ల ఏమి జరుగుతుంది అని ఎవరైనానన్ను అడిగితే భారతీయులంతా ఏకమై యిందుకు నడంబిగించి పోరాడితే తక్షణం సత్ఫలితం లభించి తీరుతుందని చెబుతాను మనలో చాలామంది కష్టాలకు తట్టుకోలేక జారిపోతే పోరాటం చాలాకాలం సాగవచ్చు. పిడికెడుమందైనా చివరివరకు త్యాగాలు చేయడానికి సిద్ధపడితే అంతిమ విజయం మనకు లభించి తీరుతుందని నానిశ్చితాభిప్రాయం

"ఇక నావ్యక్తి గత బాధ్యతనుగురించి రెండు మాటలు చెబుతాను ఒకవైపున ప్రమాదాల్ని గురించి హెచ్చరిస్తూ వున్నానంటే మరో వైపున ప్రతిజ్ఞ చేయమని ప్రోత్సాహిస్తున్నానన్నమాట నాబాధ్యతను గుర్తిస్తున్నాను ఆవేశంలో యిక్కడఅంతా ప్రతిజ్ఞచేసి తరువాత నిర్బలులై జారుకొంటే, బహుకొద్దిమంది మాత్రమే అగ్నిపరీక్షకు సిద్ధపడవచ్చు. అట్టిస్థితిలో సైతం నా లక్ష్యం ఒక్కటే

"ప్రాణాలుపోయినా సరే చట్టం ముందు తలవంచను" అలా జరగదు