పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

సత్యాగ్రహ పుట్టుక


విలువవుండదు. ఇహలోకంలోను, పరలోకంలోను శిక్ష పొందుతాడు సేర్‌హాజిహబీబ్ అటువంటి గంభీరమైన ప్రతిజ్ఞ చేయమని సూచిస్తున్నారు ఈ సభలో అర్థంచేసుకోలేనివాడు, ఒక్కడుకూడా లేడు. మీరంతా ప్రౌడులు అనుభవజ్ఞులు మీరు ప్రపంచాన్ని చూచారు. మీలో చాలామంది జాతికి ప్రతినిధులు మీలో చాలామంది బాధ్యత గల పనులు నిర్వహించారు అందువల్ల తెలియక యిట్టి ప్రతిజ్ఞ చేశానని చెప్పి తప్పించుకునేందుకు వీలులేదు. "ప్రతిజ్ఞలు, వ్రతాలు ఎంతో మహత్తరమైన సమయంలోనే చేస్తూవుంటాం ఆషామాషీగా ప్రతిజ్ఞలు చేసేవాడు వాటిమీద నిలబడలేడు దక్షిణాఫ్రికాయందలి భారతీయులకు మంచి పరీక్షా సమయం యిప్పుడే వచ్చింది యిప్పుడువేసే ప్రతి అడుగు స్థిరంగా, యోచించి గట్టిగా వేయాలి దానికి కూడా ఒక హద్దువున్నది. ఆహద్దును మనంచేరుకున్నాం ప్రభుత్వం సభ్యత యొక్క హద్దును దాటింది. యిప్పుడు మనం నోరు మూసుకొని కూర్చుంటే, త్యాగాలకు సిద్ధపడి దురన్యాయాన్ని ఎదుర్కోకపోతే పిరికివాళ్లం, పనికిమాలిన వాళ్లం అయిపోతాం యిప్పుడు ప్రతిజ్ఞను అర్థంచేసుకొని చేయాలి. ప్రతివ్యక్తీ ఎవరికి వారు యిట్టి శక్తి నాకు వున్నదా లేదా అని స్వయంగా అలోచించుకోవాలి. ఆమలుచేయగలమని ధైర్యంవుంటేనే ప్రతిజ్ఞచేయాలి ఆడంబరంకోసం యిలాంటి ప్రతిజ్ఞచేయకూడదు మనయీ ప్రతిజ్ఞయొక్క ప్రభావం స్థానిక ప్రభుత్వం, పెద్ద బ్రిటిష్ ప్రభుత్వం భారతప్రభుత్వం మీద ఏమిపడుతుంది అని ఆలోచించకూడదు. ప్రతివ్యక్తి గుండెమీద చేయివేసుకొని తనను తాను పరీక్షించకోవాలి మనస్సాక్షిగా శక్తి వుందనితోస్తే ప్రతిజ్ఞ చేయాలి అప్పుడే ప్రతిజ్ఞ సత్ఫలితాలనిస్తుంది

"ఇక దీని పరిణామాల్ని గురించి కూడా రెండు మాటలు చెబుతాను ఈ తీర్మానం చిత్తశుద్ధిగా అంగీకరించే ధీశాలురైన భారతీయుల సంఖ్య అధికంగా వుంటే, అంతా తమమాట మీదగట్టిగా నిలబడి బిల్లును వ్యతిరేకిస్తే యీ బిల్లు ప్యాసుకాదు. ప్యాసైనా వెంటనే రద్దు చేయబడుతుంది బిల్లును వ్యతిరేకించడం వల్ల మనం ఎక్కువకష్టాలు పడవలసిన అవసరం