పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

సత్యాగ్రహ పుట్టుక


అనే రంగంలోకి దిగుదాం కాని, అట్టి స్థితివచ్చిందనే అనుకోండి, అంతా తప్పుకున్నారనుకోండి. నేనొక్కణ్ణే మిగిలానని అనుకోండి, అయినా నేను నాప్రతిజ్ఞమీద నిలబడతాను నాయీ మాటను మీరంతా తెలుసుకోండి యిది అభిమానంతో చెప్పేమాటకాదు. ఈ సభలో కూర్చున్న భారతీయ నాయకులకు యిది నా హెచ్చరిక అని మనవి చేస్తున్నాను. నన్ను ఉదాహరణగా పేర్కొని మీకు స్పష్టంగా చెబుతున్నాను. మీకు స్థైర్యం లేకపోతే ప్రతిజ్ఞచేయకండి మరొక్క విషయం యిష్టంలేకపోతే దీన్ని వ్యతిరేకించండి కాని చేసే పనిమాత్రం త్రికరణశుద్ధిగా చేయండి “ఎవరు ఏంచేసినా సరే నేను మాత్రం చివరివరకు పోరాడుతాను అనే దృఢనిర్ణయంతో యీ ప్రతిజ్ఞచేయండి

ఈ విధంగా చెప్పినేను కూర్చున్నాను ఎంతో శాంతివహించి జనం నామాటలు విన్నారు. యితర నాయకులు కూడా మాట్లాడారు. అందురూ తమ బాధ్యతను, శ్రోతల బాధ్యతను గురించి మాట్లాడారు. తరువాత సభాధ్యక్షుడు లేచి నిలబడ్డారు. వారు స్థితిని సమీక్షించారు. చివరికి అంతాలేచి నిలబడి దేవుణ్ణి సాక్షిగా వుంచి క్రింది విధంగా ప్రతిజ్ఞ చేశారు “బిల్లు ప్యాసైచట్టం అయితే మేముదాని ముందు తలవంచము" అదీ ప్రతిజ్ఞ ఆదృశ్యాన్ని జీవితంలో మర్చిపోలేను జనంలో ఉత్సాహం ఉరకలేసింది. రెండో రోజున ఏదో ప్రమాదంజరిగి యూదుల ఆ నాటకశాల తగులబడిపోయింది. మూడో రోజున జనం యీ వార్తతో నా దగ్గరికి వచ్చారు. యిదిశుభ శకునం అని అంతా అనడం ప్రారంభించారు. నాటకశాల భస్మం అయినట్లే యీబిల్లు కూడా భస్మం అయిపోతుందని అంతా అన్నారు. యిటువంటి వాటి ప్రభావం ఎన్నడూ నామీద పడదు. అందువల్ల నేను ఏమీ మాట్లాడలేదు. ప్రజల్లోగల భావాన్ని తెలుపడంకోసం యీ విషయం యిక్కడ వ్రాశాను. భారతజాతి చూపిన ధైర్యసాహసాల్ని వచ్చే ప్రకరణాల్లో మీరు గ్రహిస్తారు

పైసభ జరిగిన తరువాత కార్యకర్తలు ఊరుకోలేదు. ఎన్నో సభలు