పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

93


ఆంక్షలు తెల్లవారికి, భారతీయులకి ఒకేవిధంగా లేవు ఎక్కువమంది జనం ప్రవేశిస్తే వారికి ఆహారపానీయాలు కూడా లభించే పరిస్థితి యిప్పుడు అక్కడ లేదు. యుద్ధం అయిపోయిన తరువాత కూడా అక్కడి దుకాణాలు పూర్తిగా తెరుపబడకపోవడమే అందుకు కారణం దుకాణాల్లో గల సామగ్రిని బోయర్ ప్రభుత్వం కాజేసింది. అందువల్ల కొంత కాలం యీ ఆంక్ష వుంటే నష్టం లేదని అనుకున్నాను. అయితే ట్రాన్స్‌వాల్ ప్రవేశించే తెల్లవారికి, భారతీయులకు గల నిబంధనల్లో చాలా మార్పులు చేశారు. అనుమతి పత్రం యిచ్చేవిధానం మారింది. ఈ మార్పు సందేహాలకు, భయానికి తావు యిచ్చింది. అనుమతిపత్రాలు యిచ్చే ఆఫీసులు హార్బర్ల దగ్గర ఏర్పాటు అయ్యాయి. ఇంగ్లీషువాళ్లకు అడగగానే ఆ ఆఫీసుల్లో అనుమతి పత్రాలు యిస్తున్నారు. కాని భారతీయుల కోసం వేరే ఏషియాటిక్ శాఖను ప్రారంభించారు

ఈ విధంగా వేరే శాఖను మొదటిసారి ప్రారంభించారన్నమాట ఆ ఆఫీసుల్లో భారతీయులు అర్జీ పెట్టుకోవాలి ఆ అర్జీ మంజూరు కాగానే డర్బన్‌లేక, మిగతా హార్బర్లలో సామాన్యంగా అనుమతి పత్రాలు లభిస్తూవుంటాయి. నేను కూడా అనుమతి పత్రంతీసుకోవాలంటే, శ్రీ ఛేంబర్లెన్ ట్రాన్స్‌వాల్‌ను వదిలివెళ్లేంత వరకూ వేచివుండవలసిన స్థితి ఏర్పడింది ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు అటువంటి పత్రం నాకోసం సంపాదించలేకపోయారు. యిదివారిశక్తికి మించిన పని అయిపోయింది నాకు యిచ్చే అనుమతి పత్రానికి ఆధారం డర్బన్‌తో గల నా పరిచయమే పత్రం యిచ్చే అధికారిని నేను ఎరుగను. కాని డర్బన్ యందలి పోలీసు సూపరింటెండెంటును ఎరుగుదును అందువల్ల వారిని వెంటబెట్టుకొని వెళ్లి, ఆ అధికారికి నన్ను పరిచయంచేసుకొన్నాను. 1893లో నేను ఒక సంవత్సరం ట్రాన్స్‌వాల్‌లో వున్నానని చెప్పి అనుమతి పత్రం తీసుకున్నాను ప్రిటోరియా చేరాను

ప్రిటోరియాలో మరో వాతావరణం కనబడింది. ఏషియాటిక్ శాఖ భయంకరమైనదని, భారతీయుల్ని అణిచివేసేందుకే అశాఖ తెరవబడిందనీ అర్థం చేసుకున్నాను. ఆశాఖలో పనిచేస్తున్న ఆఫీసర్లంతా బోయర్ యుద్ధ