పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

యుద్ధం తరువాత


ఉన్నతాధికారులు యీ యుద్ధానికి గల కారణాల్లో బోయర్లు భారతీయులయెడ ప్రవర్తిస్తున్న చెడ్డతీరు కూడా ఒకటని ప్రకటించారు ప్రిటోరియా యందలి బ్రిటిష్ ఏజంటు కూడా నాతో అనేక సార్లు ట్రాన్స్‌వాల్ బ్రిటీష్ సామ్రాజ్యంలో అధినివేశ రాజ్యంగా మారితే అక్కడి భారతీయుల స్థితిగతులన్నీ మారిపోతాయని చెప్పాడు. తెల్లవారుకూడా రాజ్యవ్యవస్థ మారగానే ట్రాన్స్‌వాల్ యందలి పాత ప్రభుత్వం భారతీయులపై పెట్టిన ఆంక్షలు, చట్టాలు అన్నీ రద్దు అయి పోతాయని భామించారు. నిజానికి కొంత మంచి మార్పుకూడా కనబడింది. భూముల్ని వేలంవేసే అధికారులు బోయర్ యుద్దానికి పూర్వం భారతీయులు పాడిన పాటను అంగీకరించేవారుకాదు అట్టి వాళ్లు యిప్పుడు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. చాలా మంది భారతీయులు వేలంపాటలో భూముల్ని కొన్నారు కూడా పాటల్ని అంగీకరించిన తరువాత భూముల్ని రిజిష్టరు చేయించుకుందామని ఆఫీసులకి వెళ్లితే 1885 నాటిచట్ట మందలి 3వ నిబంధన ప్రకారం రిజిష్టరీ చేయుటకు నిరాకరించారు. డర్బన్ హార్బరులో దిగగానేయీ విషయం తెలిసింది మీరుట్రాన్స్‌వాల్ వెళ్లడం అవసరమని భారతీయ నాయకులు నాకు చెప్పారు. అయితే మి॥ ఛేంబర్లెస్ మొదట డర్బన్ వస్తాడని, యిక్కడి (నేటాల్) భారతీయుల స్థితిని గురించి వారికి చెప్పాలని, యిక్కడ పని పూర్తికాగానే ఆయనతో బాటు ట్రాన్స్‌వాల్ మీరు వెళ్ళమనికూడా వాళ్లు చెప్పారు

నేటాలులో భారతీయ ప్రతినిధి బృందం శ్రీ ఛేంబర్లేను కలిసింది. బృంద సభ్యులు చెప్పిందంతా శాంతితోను, సహనంతోను విని ఛేంబర్లేను నేటాల్ మంత్రి మండలి సభ్యులతో మాట్లాడతానని మాట యిచ్చాడు. బోయర్ యుద్దానికి పూర్వం భారతీయులకు వ్యతిరేకంగా నేటాల్‌లో జరిగిన చట్టాల్లో వెంటనే మార్పు వస్తుందని నేను ఆశించలేదు. అచట్టాల్ని గురించి గత ప్రకరణాల్లో నేను వివరించాను

బోయర్ యుద్ధానికి పూర్వం ఏభారతీయుడైనా, ఎప్పుడైనా ట్రాన్స్‌వాల్‌కు వెళ్లవచ్చు కాని యిప్పుడు ఆస్థితి మారిపోయిందని గ్రహించాను. అప్పుడు