పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

యుద్ధం తరువాత


సమయంలో సైన్యంతో బాటు భారతావని నుంచి దక్షిణాఫ్రికాకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావించి అక్కడ వుండిపోయిన వాళ్లే వారిలో కొందరు లంచాలు తినేరకం అట్టి యిద్దరు అధికారులపై లంచాలు అన్నారని కోర్టులో కేసులు కూడా నడిచాయి జడ్జీలు యిద్దరినీ నిర్దోషులని ప్రకటించి వదిలివేశారు. కాని లంచాలు తిన్నారని స్పష్టంగా బయట పడినందున ఆయిద్దరినీ ఉద్యోగాలనుంచి తొలగించివేశారు పక్షపాతానికి అక్కడ అంతే లేదు. ఎక్కడైనా సరే కొత్త విభాగాన్ని ప్రారంభిస్తే, అది అమల్లోవున్న అధికారాల్ని తగ్గించడంకోసమే కొత్త కొత్త అంక్లల్ని యోచించడం మొదలు పెడుతుంది. ఏషియాటిక్ విభాగం కూడా యిటువంటి రకమే

ఇక నాకార్యక్రమం మొదటి నుంచి ప్రారంభించక తప్పదనే నిర్ణయానికి వచ్చాను నేను ట్రాన్స్‌వాల్‌లోకి ఎలా ప్రవేశించానో ఏషియాటిక్ విభాగానికి బోధపడలేదు నన్ను తిన్నగా అడగడానికి అక్కడి వాళ్లకు ధైర్యం చాలలేదు అయితే నేను దొంగతనంగా ప్రవేశించే వ్యక్తిని కాదని వాళ్లకు తెలుసు నాకు ప్రవేశపత్రం ఎలా అందిందో వాళ్లు తెలుసుకున్నారు. ప్రిటోరియాలో భారతీయుల ప్రతినిధి బృందం కూడా శ్రీ ఛేంబర్లేనును కలుసుకునేందుకు సిద్ధపడింది. వారికి అందజేయవలసిన ఆర్జీని నేను తయారు చేశాను అయితే ఏషియాటిక్ విభాగం వాళ్లు నన్ను శ్రీ ఛేంబర్లేను కలుసుకోనీయలేదు అట్టి స్థితిలో తాముకూడా శ్రీ ఛేంబర్లేను కలుసుకో కూడదనే నిర్ణయానికి ప్రతినిది బృందసభ్యులు వచ్చారు. కానినేను అందుకు అంగీకరించలేదు నాకు జరిగిన అవమానాన్ని నేను మింగుతాను. మీరు లెక్కచేయవద్దని వారికి నచ్చ చెప్పాను ఆర్జీసిద్ధంగావున్నది. దాన్ని శ్రీ ఛేంబర్లేనుకు వినిపించడం అవసరం భారతీయ బారిష్టరు శ్రీ జార్జ్‌గాడ్ర్‌ఫ్రే అక్కడ వున్నారు. శ్రీ ఛేంబర్లేనుకు అర్జీ వినిపించుటకు వారిని సిద్ధంచేశాను. భారతీయ ప్రతినిధి బృందం ఛేంబర్లేనును కలిసింది. అక్కడ నా విషయం వచ్చింది "నేను డర్బన్‌లో మిష్టర్ గాంధీని కలిశాను. అందువల్ల యిక్కడ వారిని కలవనని చెప్పాను ట్రాన్స్‌వాల్ విషయం ట్రాన్స్‌వాల్‌వారి ముఖత: వినాలని