పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x


హిమాలయమంత పొరపాటు చేశానని నేను అంగీకరించవలసి వచ్చింది ఉపవాసం కూడా చేయవలసి వచ్చింది. ఇతరులచేత కూడా చేయించవలసి వచ్చింది.

ఆరవ పోరాటం రౌలట్ ఆక్టుకు వ్యతిరేకంగా జరిగింది. అప్పుడు మా యందలి దోషాలు బైటకు పెల్లుబికాయి అయితే మూలంలో గల ఆధారం మాత్రం సత్యమార్గాన వున్నది మా దోషాలను అంగీకరించాం. అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాం రౌలట్ ఆక్టు అమల్లోకిరాలేదు. ఆనల్ల చట్టం రద్దు చేయబడింది యీ సంగ్రామం మాకు పెద్ద గుణపారం నేర్పింది

ఏడవ పోరాటం ఖిలాఫత్‌కు సంబంధించినది యిది పంజాబ్‌లో జరిగిన దుర్మార్గాలకు వ్యతిరేకంగాను స్వరాజ్యప్రాప్తి కోసమూ జరిగిన పోరాటం యీ పోరాటం యిప్పటికీ జరుగుతూనే వున్నది. ఒక్క సత్యాగ్రహి అయినా సరే, చివరివరకు నిలిచిపోరాడితే విజయం లభించి తీరుతుందని నా దృఢ విశ్వాసం

ఇప్పుడు దేశంలో జరుగుతున్నది మహాభారత సంగ్రామమే యిష్టం లేకుండానే యిది ప్రారంభమైన తీరును గురించి వివరించాను వీరమ్ గ్రామ పోరాటం తరువాత యింకా చాలా పోరాటాలు జరుపవలసి వస్తుందని నేను అనుకోలేదు. దక్షిణాఫ్రికాలో వున్నప్పుడు అసలు వీరమ్ గ్రామ్‌ను గురించి నాకు ఏమీ తెలియదు సత్యాగ్రహ విశేషం యిదే దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్లనక్కర లేదు. అదే వెతుక్కుంటూ మనదగ్గరికి వస్తుంది. యీ నుగుణం సత్యాగ్రహ సిద్ధాంతంలోనే యిమిడి వున్నది. రహస్యమంటూ ఏమీ లేనిది, జిత్తులు ఎత్తులు ఏమీ లేనిది, అసత్యమంటూ ఏమీలేనిది ధర్మయుద్ధం ఇదే సత్యాగ్రహం అది వెతుక్కుంటూ మనదగ్గరకు వస్తుంది ధర్మబుద్ధి కలిగిన మనిషి అందుకు సిద్ధంగా వుంటాడు ముందే ప్లాను వేసుకొన్నదే ధర్మయుద్ధం కాదు. ధర్మయుద్ధం చేయించేవాడూ, చేసేవాడూ ఆపరమాత్ముడే దేవునిపేరుతోనే ధర్మయుద్ధం జరుగుతుంది. సత్యాగ్రహి దగ్గర గల శక్తులన్నీ ఉడిగినప్పుడు, సత్యాగ్రహి నిర్భలుడైనప్పుడు, సత్యాగ్రహిని నాలుగువైపుల అంధకారం ఆవరించినప్పుడు పరమాత్ముడే వచ్చి అతడికి